Ravanasura: ‘సినిమా బాగుంది.. నిజంగా బాగుంది’.. రవితేజ రావణాసురపై నెటిజన్ల స్పందన ఇదే.
రవితేజ హీరోగా రావణాసుర సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ కనిపించని పాత్రలో దర్శనమిచ్చారు. శ్రీరామ్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, మురళీ శర్మ వంటి...

రవితేజ హీరోగా రావణాసుర సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ కనిపించని పాత్రలో దర్శనమిచ్చారు. శ్రీరామ్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, మురళీ శర్మ వంటి భారీ స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకర్షించలేకపోయిందన్న వార్తలు వచ్చాయి. దీంతో సినిమా పెద్దగా కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్రం విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదిలా ఉంటే థియేటర్లలో ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన 24 గంటల్లోనే.. ఇండియా టాప్ 2లోకి రావడం విశేషం. థియేటర్లలో ఆకట్టుకోలేక పోయిన రావణాసుర ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు సైతం ‘అరే.. సినిమా బాగానే ఉందిగా. అసలు టాకే రాలేదేంటి. సినిమా నిజంగా బాగుంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.




ఇక సినిమా కథ ఓల్డ్ రివైంజ్ స్టోరీయే అయినప్పటికీ దర్శకుడు కథ చెప్పిన విధానం సరికొత్తగా ఉంది. చివరి వరకు అసలు ఏం జరుగుతుంది.? ఎందుకు జరుగుతుందన్న? క్యూరియాసిటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశంగా చెప్పొచ్చు. అయితే థియేటర్లలో డివైడ్ టాక్ తెచ్చుకున్న రావణాసుర ఓటీటీలో మాత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతో రవితేజ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




