టాలీవుడ్‌లోకి రష్మిక మాజీ బాయ్‌ఫ్రెండ్.. ఏ మేరకు మెప్పిస్తాడో..!
తమ మార్కెట్‌ను పెంచుకునేందుకు చూస్తోన్న హీరోలు, దర్శకనిర్మాతలు తమ సినిమాలను పక్క భాషల్లో కూడా విడుదల చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా సౌత్‌లోనే పెద్ద ఇండస్ట్రీగా పేరొందిన టాలీవుడ్‌పై ఇప్పుడు మిగిలిన భాషల వారి కన్ను పడింది. హాలీవుడ్, బాలీవుడ్ సహా కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ హీరోలు, దర్శకనిర్మాతలు టాలీవుడ్‌లోకి తమ సినిమాలను డబ్బింగ్ చేసేందుకు ఉవ్విలూరుతున్నారు. వీరిలో కొంతమంది సక్సెస్ అవుతున్నా.. మరికొందరు మాత్రం ఇప్పటికీ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా […]
తమ మార్కెట్‌ను పెంచుకునేందుకు చూస్తోన్న హీరోలు, దర్శకనిర్మాతలు తమ సినిమాలను పక్క భాషల్లో కూడా విడుదల చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా సౌత్‌లోనే పెద్ద ఇండస్ట్రీగా పేరొందిన టాలీవుడ్‌పై ఇప్పుడు మిగిలిన భాషల వారి కన్ను పడింది. హాలీవుడ్, బాలీవుడ్ సహా కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ హీరోలు, దర్శకనిర్మాతలు టాలీవుడ్‌లోకి తమ సినిమాలను డబ్బింగ్ చేసేందుకు ఉవ్విలూరుతున్నారు. వీరిలో కొంతమంది సక్సెస్ అవుతున్నా.. మరికొందరు మాత్రం ఇప్పటికీ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా కన్నడ నటుడు రక్షిత్ శెట్టి చేరిపోయాడు.
సచిన్ రవి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి నటించిన తాజా చిత్రం ‘అవనే శ్రీమన్నారాయణ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. అతడే శ్రీమన్నారయణ పేరుతో ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కాబోతుండగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఇక్కడి ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తుండటం మరో విశేషం.
అయితే రక్షిత్ శెట్టి పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా గుర్తుపట్టలేకపోయినా.. రష్మిక మందన్న మాజీ భాయ్‌ఫ్రెండ్‌గా ఇక్కడి వారికి బాగా తెలుసు. హీరోయిన్‌గా రష్మిక ఎంట్రీ శాండిల్‌వుడ్‌లోనే జరిగింది. రక్షిత్ శెట్టితో మొదటి సినిమాలో(కిర్రిక్ పార్టీ) నటించిన రష్మిక.. షూటింగ్ సమయంలో అతడితో ప్రేమలో పడింది. దీంతో ఈ మూవీ విడుదల అయ్యాక వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ కారణాలు తెలీవు గానీ.. గతేడాది వీరిద్దరు తమ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తరువాత వారి వారి కెరీర్‌లో ఈ ఇద్దరు బిజీ అయ్యారు. ఏదేమైనా ‘అతడే శ్రీమన్నారాయణ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న రక్షిత్ శెట్టి.. ఇక్కడ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.