అల వైకుంఠపురంలో టీజర్ గ్లింప్స్..ఫుల్ జోష్‌లో బన్నీ ఫ్యాన్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐతే ఆదివారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయాల్సి ఉండగా..కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఆ టీజర్‌ను డిసెంబర్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సినిమా యూనిట్. ఐతే ట్రైలర్ రిలీజ్ పోస్ట్‌పోన్ అవడంతో నిరుత్సాహంగా ఉన్న ఫ్యాన్స్ కోసం టీజర్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐతే ఆదివారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయాల్సి ఉండగా..కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఆ టీజర్‌ను డిసెంబర్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సినిమా యూనిట్.
ఐతే ట్రైలర్ రిలీజ్ పోస్ట్‌పోన్ అవడంతో నిరుత్సాహంగా ఉన్న ఫ్యాన్స్ కోసం టీజర్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో వైట్ షర్ట్‌తో రెడ్ కలర్ కోటును చేతిలో పట్టుకొని వెనక్కి తిరిగి నిలబడి ఉన్నవీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్రివ్రికమ్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే తమన్ సంగీతం సమకూర్చిన సామజవరగమన, రాములో రాముల పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలో అందాల భామ పూజా హెగ్డే..స్టైలిష్ స్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.