రేపు ట్రైలర్ రిలీజ్..వైరలవుతోన్న టీజర్
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటిస్తున్న తాజా చిత్రం ఛపాక్. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మేఘనా గుల్జార్. ఈ సినిమాలో లీడ్ రోల్‌తో పాటు నిర్మాత కూడా దీపికానే. ఐతే లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించి 6 సెకన్ల టీజర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది దీపిక. అందులో రేపు ట్రైలర్ విడుదల..తప్పక చూడండి అంటూ కామెంట్ చేశారామె. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. […]
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటిస్తున్న తాజా చిత్రం ఛపాక్. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మేఘనా గుల్జార్. ఈ సినిమాలో లీడ్ రోల్‌తో పాటు నిర్మాత కూడా దీపికానే. ఐతే లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించి 6 సెకన్ల టీజర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది దీపిక. అందులో రేపు ట్రైలర్ విడుదల..తప్పక చూడండి అంటూ కామెంట్ చేశారామె. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇక ఈ సినిమాలో దీపికా లుక్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే హల్‌చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో దీపికా లక్ష్మీ అగర్వాల్‌లానే కనిపించడంతో పాటు..ఆమె హావభావాలు కూడా అచ్చం అలానే ఉన్నాయని అంటున్నారు దర్శకురాలు మేఘనా గుల్జార్. ఈ చిత్రంలో దీపిక నటన గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని..ఆమెను మరో స్థాయికి చేరుస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను..డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
A moment is all it took… Trailer out tomorrow.Keep watching this space…#Chhapaak@meghnagulzar @masseysahib @_KaProductions @foxstarhindi @MrigaFilms pic.twitter.com/OepDzgm1ic
— Deepika Padukone (@deepikapadukone) December 9, 2019
A character that will stay with me forever…#Malti
Shoot begins today!#Chhapaak
Releasing-10th January, 2020.@meghnagulzar @foxstarhindi @masseysahib pic.twitter.com/EdmbpjzSJo
— Deepika Padukone (@deepikapadukone) March 25, 2019