పున్నుపై రాహుల్ సంచలన కామెంట్.. ఎప్పటికీ అంటూ..!

బయట ఉన్నప్పుడు ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలియని ఆ ఇద్దరు.. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లిన తరువాత మంచి స్నేహితులుగా మారారు. ఆ తరువాత హౌస్‌లో వీరిద్దరి రొమాన్స్‌కు బయట ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇక బయటకు వచ్చాక కూడా ఆ ఇద్దరు అదే ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. కాగా తాజాగా పునర్నవితో తాను తీసుకున్న ఫొటోను షేర్ చేసిన రాహుల్.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘తెలియని వ్యక్తిగా వచ్చి మంచి స్నేహితురాలిగా […]

పున్నుపై రాహుల్ సంచలన కామెంట్.. ఎప్పటికీ అంటూ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 09, 2019 | 8:51 PM

బయట ఉన్నప్పుడు ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలియని ఆ ఇద్దరు.. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లిన తరువాత మంచి స్నేహితులుగా మారారు. ఆ తరువాత హౌస్‌లో వీరిద్దరి రొమాన్స్‌కు బయట ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇక బయటకు వచ్చాక కూడా ఆ ఇద్దరు అదే ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. కాగా తాజాగా పునర్నవితో తాను తీసుకున్న ఫొటోను షేర్ చేసిన రాహుల్.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘తెలియని వ్యక్తిగా వచ్చి మంచి స్నేహితురాలిగా మారావు. బిగ్‌బాస్ జర్నీలో నువ్వు నాకు చాలా సపోర్ట్ ఇచ్చావు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఙ్ఞాపకాలు ఇచ్చావు’’ అని రాసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా ‘‘ఇంక సాలు తీ.. మస్తైంది ఇక సల్లవడు నవి’’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో తామిద్దరం మంచి స్నేహితులమే అన్నట్లుగా మరోసారి క్లారిటీ ఇచ్చాడు రాహుల్. కాగా రాహుల్ సిప్లిగంజ్, ‘బిగ్‌బాస్ 3 ‘ట్రోఫిని గెలిచేందుకు సహాయం చేసిన వారిలో పునర్నవి ఒకటి. హౌస్‌లో రాహుల్‌కు ఆమె ఇచ్చిన సపోర్ట్‌ను వీక్షకులెవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. హౌస్‌లో ఉన్న సమయంలో అతడిలోని లోపాలను బయటకు చెప్తూ.. టాస్క్‌లు ఆడేందుకు రాహుల్‌ను ఎంకరేజ్ చేసేది పున్ను. కానీ పునర్నవి హౌస్‌లో ఉన్న సమయంలో కాస్త బద్ధకంగా ఉన్న రాహుల్.. ఆమె ఎలిమినేట్ అయిన తరువాత మాత్రం పూర్తిగా మారిపోయాడు. టాస్క్‌ల్లో ఉత్సాహంగా పాల్గొన్న రాహుల్.. అందరికంటే ముందుగా ఫైనల్‌కు చేరాడు. ఇక గ్రాండ్ ఫినాలేలో రాహుల్‌ గెలిచేందుకు… పునర్నవి ఫ్యాన్స్ కూడా బయట సహాయం చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ‘బిగ్‌బాస్‌ 3’ను గెలిచిన తరువాత రాహుల్‌కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు రాహుల్. ఈ మూవీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ బిగ్‌బాస్ విన్నర్. ఇటీవల సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.instagram.com/p/B50D6N3HVdR/