‘సూర్యుడివో చంద్రుడివో’.. దేవీ అదరగొట్టేశాడుగా..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు నుంచి రెండో పాట వచ్చేసింది. సూర్యుడివో చంద్రుడివో అంటూ సాగే ఈ పాటను బి ప్రాక్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మెలోడియస్‌గా సాగుతున్న ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అదరగొట్టేస్తోంది. ముఖ్యంగా ఈ పాటతో మెలోడీ పాటలను చేయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు రాక్‌స్టార్. ఇక పల్లెటూరులో ఈ పాటను తెరకెక్కించినట్లు విజువల్స్‌లో […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు నుంచి రెండో పాట వచ్చేసింది. సూర్యుడివో చంద్రుడివో అంటూ సాగే ఈ పాటను బి ప్రాక్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మెలోడియస్‌గా సాగుతున్న ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అదరగొట్టేస్తోంది. ముఖ్యంగా ఈ పాటతో మెలోడీ పాటలను చేయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు రాక్‌స్టార్. ఇక పల్లెటూరులో ఈ పాటను తెరకెక్కించినట్లు విజువల్స్‌లో అర్థమవుతుండగా.. అందులో మహేష్‌తో పాటు విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, కౌముడి, బేబి క్రితిక తదితరులు కనిపించారు.
కాగా ఈ మూవీలో నుంచి గత సోమవారం ‘మైండ్‌బ్లాక్’ అనే సాంగ్ విడుదలైంది. మాస్ బీట్‌తో ఈ పాట రాగా.. దానికి మిక్స్‌డ్ టాక్ వినిపించింది. కొందరేమో పాట అదిరిపోయిందంటూ కామెంట్లు పెట్టినా.. మరికొందరేమో దేవీ తన ట్యూన్లను రిపీట్ చేశాడంటూ కామెంట్లు చేశారు. అయితే ఆ విమర్శలకు తాజా పాటతో చెక్ పెట్టేశాడు డీఎస్పీ. రామజోగయ్య శాస్త్రి అర్థవంతమైన సాహిత్యానికి దేవీ ఇచ్చిన అద్భుతమైన ట్యూన్లు, ప్రాక్ గాత్రం ‘సూర్యుడివో చంద్రుడివో’ పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. అంతేకాకుండా విజువల‌్‌గానూ ఈ మూవీ మెప్పించనున్నట్లు అర్థమవుతోంది.
అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించాడు. ఆయన సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.