AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘తలైవా’ మూవీలో ‘మహానటి’.. అధికారిక ప్రకటన

సినిమాలను చేయడంలో వేగాన్ని పెంచిన సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్శకుడు శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ నటించబోతున్నట్లు ఎప్పటి నుంచో గాసిప్‌లు వినిపించగా.. తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. తలైవార్ 168వ చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తోంది అని సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటనను ఇచ్చేసింది. అయితే ఈ మూవీలో రజనీతో కీర్తి […]

'తలైవా' మూవీలో 'మహానటి'.. అధికారిక ప్రకటన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 09, 2019 | 7:13 PM

Share

సినిమాలను చేయడంలో వేగాన్ని పెంచిన సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్శకుడు శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ నటించబోతున్నట్లు ఎప్పటి నుంచో గాసిప్‌లు వినిపించగా.. తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. తలైవార్ 168వ చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తోంది అని సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటనను ఇచ్చేసింది. అయితే ఈ మూవీలో రజనీతో కీర్తి రొమాన్స్ చేయనుందా..? లేక కీలక పాత్రలో నటించనుందా..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈ మూవీలో మరో కీలక పాత్రలో కమెడియన్ సూరి కనిపించబోతున్నాడు. అలాగే ఖుష్బూ, మీనా కూడా ఈ మూవీలో భాగం అవ్వబోతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

కాగా మురగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన దర్బార్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో రజనీ పోలీస్ పాత్రలో నటించగా.. ఆయన సరసన నయనతార నటించింది. సునీల్ శెట్టి, నివేథా థామస్, యోగీ బాబు, శ్రీమన్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్లు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు రాజకీయాల్లోకి వస్తానని ఎప్పటినుంచో చెప్తోన్న రజనీకాంత్.. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలోనే వీలైనన్ని సినిమాల్లో నటించి, ఆ తరువాత మూవీలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు సమాచారం. మరోవైపు తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Follow Us
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా
పుట్టిన కొన్ని గంటల్లో తేడా.. ఆడ శిశువులు ముఖాలనే ఎక్కువగా చూస్తా
పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!
పూజలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? ఇలాంటి గంట శుభప్రదమట!
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..