రానా ఏ హీరో గుట్టు రట్టు చేయబోతున్నాడో..!

శస్త్ర చికిత్స చేయించుకొని ఇటీవల పూర్తిగా కోలుకున్న దగ్గుబాటి వారసుడు రానా.. సినిమాలపై మళ్లీ ఫోకస్ పెట్టాడు. ఓ వైపు తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంటూనే.. మరోవైపు ప్రొడక్షన్స్ పనులు చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ చిత్రాన్ని సమర్పించబోతున్నాడు ఈ హీరో. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాను రానా సమర్పించబోతున్నాడు. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తోన్న […]

రానా ఏ హీరో గుట్టు రట్టు చేయబోతున్నాడో..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 09, 2019 | 8:02 PM

శస్త్ర చికిత్స చేయించుకొని ఇటీవల పూర్తిగా కోలుకున్న దగ్గుబాటి వారసుడు రానా.. సినిమాలపై మళ్లీ ఫోకస్ పెట్టాడు. ఓ వైపు తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంటూనే.. మరోవైపు ప్రొడక్షన్స్ పనులు చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ చిత్రాన్ని సమర్పించబోతున్నాడు ఈ హీరో. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాను రానా సమర్పించబోతున్నాడు. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, శీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. ఆగష్టులోనే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ డిసెంబర్ 11న విడుదల కానుంది.

అయితే ఈ చిత్రం నిజ జీవితంలో వచ్చిన రూమర్ల ఆధారంగా తెరకెక్కడం విశేషం. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక టైటిల్‌ను బట్టి చూస్తుంటే.. ఇదేదో ఓ వ్యక్తికి సంబంధించినదిగా అర్థమవుతోంది. అయితే ఆ వ్యక్తి సినిమా ఇండస్ట్రీ వ్యక్తినా..? లేక రాజకీయ నాయకుడా..? లేక పేరుమోసిన సెలబ్రిటీనా..? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా 2016లో క్షణం మూవీని తెరకెక్కించిన రవికాంత్ పేరేపు దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. మరి తనపై వచ్చే రూమర్లను ఎప్పుడూ పట్టించుకోని రానా ఇప్పుడు ఎవరి రూమర్లను బయటపెట్టబోతున్నాడు..? ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.