మా అమ్మ కోరిక నెరవేరబోతోంది: చెర్రీ

తన అమ్మ కోరిక త్వరలోనే తీరబోతుందని మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చరణ్.. ఆచార్యలో

మా అమ్మ కోరిక నెరవేరబోతోంది: చెర్రీ
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 12:55 PM

Ram Charan News: తన అమ్మ కోరిక త్వరలోనే తీరబోతుందని మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చరణ్.. ఆచార్యలో తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తను నటించిన మగధీర, బ్రూస్‌లీ చిత్రాల్లో తన తండ్రి అతిథి పాత్రలు చేసినప్పటికీ.. ఈ మూవీలో మరికొంతసేపు ఇద్దరం స్క్రీన్‌లో కనిపించనున్నామని వివరించారు. తామిద్దరం కలిసి నటించాలన్నది తన తల్లి కోరిక అని, అది త్వరలో నెరవేబోతుందని వెల్లడించారు.

అయితే చిరంజీవి నటిస్తోన్న ఆచార్యకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కాజల్ మరోసారి చిరుతో రొమాన్స్ చేయబోతోంది. సోనూసూద్, అజయ్‌, హిమజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల కాగా.. సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఇక సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అటు అభిమానుల్లో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

‘జబర్దస్త్’‌లో సుడిగారి సుధీర్ కనిపించడా..!

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం