Ram Charan: ‘పెద్ది’ సినిమా వాయిదా పడనుందా? స్వయంగా అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్.. వీడియో ఇదిగో
గత కొన్ని రోజులుగా పెద్ది సినిమా విడుదల తేదీపై సందిగ్ధం కొనసాగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుందా? లేదా మళ్లీ వాయిదా పడనుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్డ్స్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే రామ్ చరణ్ పుట్టిన రోజైన మార్చి 27నే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఈ తేదీన కూడా పెద్ది రిలీజ్ కావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గా ఒక సినిమా ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ కూడా జూన్ 26న ‘పెద్ది’ వస్తుందనేసరికి మెగా అభిమానులు కంగారుపడ్డారు. తర్వాత తనకు తెలియకుండానే చెప్పేశానని ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ది విడుదల తేదీపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తన సినిమా జూన్ 26 తేదీ విడుదల కాబోతుందంటూ వస్తోన్న వార్తలపై స్వయంగా రామ్ చరణ్ స్పందించాడు. తన చెల్లెలు నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న రాకాసా సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ కూడా చిత్ర బృందంతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఒక ప్రోమోను విడుదల చేశారు. ఇందులో భాగంగా పెద్ది సినిమా గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఈ సందర్భంగా పెద్ది సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని రామ్ చరణ్ పేర్కొన్నాడు. అందరికీ పరీక్షలు అయిపోతాయని, ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు. అదే సమయంలో పెద్ది సినిమా లేట్ అవ్వట్లేదు, ఈ విషయాన్ని ప్రమోట్ చేయండి అంటూ చరణ్ రాకాస చిత్ర బృందంతో చెప్పాడు. తద్వారా పెద్ది సినిమా రిలీజ్ వాయిదా పడలేదు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు చరణ్. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెద్ది సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విలేజ్ స్పోర్ట్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక స్టార్ హీరోయిన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
రాకాస టీమ్ తో రామ్ చరణ్..
A MEGA boost for the craziest entertainer of the season! 🌪️💥
Mega Powerstar @AlwaysRamCharan graciously spent time with Team #Rākāsā on the magnificent sets of #Peddi.
His words of appreciation have fully charged up our team! ⚡️The ultimate chaos is almost here! 🍿#RaaKaaSaa… pic.twitter.com/3GmVJn3eu2
— Pink Elephant Pictures (@PinkElephant_P) April 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




