Game Changer: అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్.. 10 లక్షల ఆర్థిక సాయం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. చెర్రీ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం విషయంలో సక్సెస్ అయిన ఓ ఫార్ములాను గేమ్ ఛేంజర్‌లోనూ రిపీట్ చేయబోతున్నారట మేకర్స్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు.
అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి సన్నిహితులను తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. కుటుంబాలకు చెరొక ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ… ”ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్ కల్యాణ్ కోరుకునేది కూడా అదే. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకు అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను” అని చెప్పారు. రామ్ చరణ్ తో పాటు నిర్మాత దిల్ రాజు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఆర్ధిక సాయం అందించారు.
ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న గ్రాండ్ గా విడుదలకానుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్దమైన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవుతుందని అంటున్నారు అభిమానులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.