బెల్లంకొండతో రెండో సారి..?

హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు బెల్లంకొండ. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీతలో నటిస్తోన్న ఈ యంగ్ హీరో.. కోలీవుడ్‌లో విజయం సాధించిన రాచ్టషన్‌లో నటించనున్నాడు. ఈ చిత్ర రీమేక్ హక్కులను కోనేరు సత్యనారాయణ కొనుగోలు చేయగా.. రమేశ్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. మార్చి నెలాఖరు నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు నటీనటులను ఎంచుకుంటున్న దర్శకనిర్మాతలు రకుల్‌ను సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం […]

బెల్లంకొండతో రెండో సారి..?

హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు బెల్లంకొండ. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీతలో నటిస్తోన్న ఈ యంగ్ హీరో.. కోలీవుడ్‌లో విజయం సాధించిన రాచ్టషన్‌లో నటించనున్నాడు. ఈ చిత్ర రీమేక్ హక్కులను కోనేరు సత్యనారాయణ కొనుగోలు చేయగా.. రమేశ్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. మార్చి నెలాఖరు నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరోవైపు నటీనటులను ఎంచుకుంటున్న దర్శకనిర్మాతలు రకుల్‌ను సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క తెలుగు చిత్రం కూడా లేకపోగా.. ఈ మూవీలో నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఇదివరకే బెల్లంకొండతో రకుల్ జోడీ కట్టిన విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక చిత్రంలో బెల్లంకొండ, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన విషయం తెలిసిందే.

Published On - 4:26 pm, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu