‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌.. రాజమౌళి కీలక నిర్ణయం

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Aug 10, 2020 | 1:28 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం).

'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌.. రాజమౌళి కీలక నిర్ణయం

Follow us on

Rajamouli plans for RRR: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఈ మూవీ షూటింగ్‌ 70శాతం పూర్తి అయ్యింది. ఇక మిగిలిన 30 శాతాన్ని త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి అనుకున్నారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న కేసులకు తోడు.. జక్కన్న, చిత్ర నిర్మాత దానయ్యకు సైతం కరోనా సోకడంతో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరింత సమయం పట్టనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌ కోసం రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అదేంటంటే.. మిగిలిన షూటింగ్‌ని విదేశాల్లో జరపాలని ఆయన అనుకుంటున్నారట. కరోనా కేసులు తక్కువగా ఉన్న దేశాల్లో ఆర్ఆర్ఆర్‌ మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయాలన్న ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు సమాచారం. అందులోనూ ఈ మూవీలో పలువురు విదేశీయుల కూడా భాగం అయినందున అక్కడ చేస్తేనే బావుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. వారి సరసన అలియా భట్, ఒలివియా కనిపించనున్నారు. అజయ్ దేవగన్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు.

Read This Story Also: నక్షత్రానికి హన్సిక పేరు.. మరిచిపోలేని బర్త్‌డే గిఫ్ట్‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu