‘ఆర్టికల్ 15’ రీమేక్​లో అడివి శేష్..!

'ఆర్టికల్ 15' రీమేక్​లో అడివి శేష్..!

బాలీవుడ్​ బ్లాక్‌బాస్ట‌ర్ హిట్​ సినిమా 'ఆర్టికల్ 15'.. తెలుగు రీమేక్​ గురించి గత కొద్దిరోజులగా చాలా రూమ‌ర్స్ సర్కులేట్ అవుతున్నాయి.

Ram Naramaneni

|

Aug 10, 2020 | 1:36 PM

Adivi Sesh Next Movie : బాలీవుడ్​ బ్లాక్‌బాస్ట‌ర్ హిట్​ సినిమా ‘ఆర్టికల్ 15’.. తెలుగు రీమేక్​ గురించి గత కొద్దిరోజులగా చాలా రూమ‌ర్స్ సర్కులేట్ అవుతున్నాయి. సీనియర్ ప్రొడ్యూస‌ర్ సురేశ్​బాబు.. ఈ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత సీనియ‌ర్ హీరో వెంకటేశ్​తో తీయాలని భావించారు. కానీ అడుగులు ముందుకు ప‌డ‌లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్ స‌ర్కులేట్ అవుతుంది.

పరువు హత్యలకు సంబంధించిన స్టోరీతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. బాలీవుడ్​లో చిన్న సినిమాగానే వచ్చినా పెద్ద విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఇప్పుడు దీని రీమేక్​ను అడివి శేష్ హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఒకవేళ అన్ని కుదిరితే త్వరలో అఫిషియ‌ల్ అనౌన్సిమెంట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ‘మేజర్’, ‘గూఢచారి 2’ సినిమాల్లో న‌టిస్తున్నాడు శేష్. వీటి చిత్రీక‌ర‌ణ‌లు పూర్తయిన తర్వాత కొత్త ప్రాజెక్టులో నటించే అవకాశముంది.

Also read : బంగా‌ళా‌ఖా‌తంలో అల్ప‌పీ‌డనం : తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu