చేపల వేపుడు ఎలా చేయాలంటే.. చిరు వీడియో చూశారా

కరోనా వేళ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు తను ఇంట్లో చేస్తోన్న పనులను ఆయన అభిమానులతో

చేపల వేపుడు ఎలా చేయాలంటే.. చిరు వీడియో చూశారా
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 12:50 PM

Chiranjeevi Fish Fry: కరోనా వేళ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు తను ఇంట్లో చేస్తోన్న పనులను ఆయన అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తన తల్లి అంజనా దేవీ కోసం చిరు చిన్న చేపల వేపుడు చేశారు. దాన్ని తిన్న అంజనా దేవీ చాలా బావుందంటూ మెచ్చుకున్నారు. దాంతో చిరు తబ్బుబ్బిపోయారు. ఈ మేరకు ఓ వీడియోను మెగాస్టార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో చిన్న చేపల వేపుడు ఎలా చేయాలి, దానికి ఏం కావాలి అన్న వాటిని కూడా వివరంగా చెప్పారు. అయితే వంటలు చేయడం మెగాస్టార్‌కి కొత్తేం కాదన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన కాజల్ రెండోసారి జత కడుతుండగా.. సోనూసూద్‌, అజయ్, హరితేజ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే చెర్రీ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

https://www.instagram.com/tv/CDshKfODBsx/?utm_source=ig_embed

Read This Story Also: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌.. రాజమౌళి కీలక నిర్ణయం