AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sheela Kaur: ‘పరుగు’ సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే స్టన్ అవుతారు.. ఫొటోస్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది షీలా కౌర్. అందం, అభినయం పరంగా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. దీని తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. అయితే ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయింది.

Sheela Kaur: ‘పరుగు’ సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే స్టన్ అవుతారు.. ఫొటోస్ వైరల్
Allu Arjun Parugu Movie Actress Sheela Kaur
Basha Shek
|

Updated on: Aug 18, 2026 | 6:19 PM

Share

షీలా కౌర్.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రలు పోషించిందీ అందాల తార. ముఖ్యంగా అల్లు అర్జున్ పరుగు సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు తీసుకొచ్చింది. అందులో మీనాక్షి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో బాగా ఒదిగిపోయిందీ షీలా. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ అందాల తార క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేముందు చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 20 సినిమాల్లో కనిపించింది షీలా. ఆ తర్వాత తమిళ సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ దాదాపు 10 సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ఇక 2006 వ సంవత్సరం లో నవదీప్ హీరోగా నటించిన ‘సీతాకోక చిలుక’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది షీల. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత మంచు మనోజ్ తో కలిసి చేసిన రాజు భాయ్ కూడా కమర్షియల్ గా విజయం సాధించలేదు. సాయిరాం శంకర్ హలో ప్రేమిస్తారా సినిమాలో కూడా షీలాకు సక్సెస్ ఇవ్వలేకపోయింది.

అయితే పరుగు సినిమా షీలా జాతకాన్ని మార్చేసింది. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ కావడంతో ఈ సొగసరికి అవకాశాలు క్యూ కట్టాయి. మస్కా, అదుర్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసిందీ అందాల తార. అయితే ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీకి దూరమైందీ ముద్దుగుమ్మ. తెలుగులో చివరిగా 2011లో బాలకృష్ణ పరమవీర చక్ర మూవీలో నటించింది షీల.

ఇవి కూడా చదవండి

పరుగు హీరోయిన్ షీలా లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sheela (@sheelaa_official)

సినిమా అవకాశాలు తగ్గడంతో 2020 వ సంవత్సరం లో చెన్నై కి చెందిన సంతోష్ రెడ్డి అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది షీల. అప్పటి నుంచి సాధారణ గృహిణిగా ఇంటికే పరిమితమైపోయిందీ అందాల తార. పెళ్లి తర్వాత చాలా ఏళ్ల పాటు మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండి పోయిందీ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్యన సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్ గా మారిపోయిందీ సొగసరి. తన ఫొటోలతో పాటు ఫ్యామిలీ ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు స్టన్ అవుతున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎంత అందంగా ఉందో ఇప్పుడు అంతకంటే అందంగా ఉందని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sheela (@sheelaa_official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us