ఆఫర్స్ నిల్లు.. గ్లామర్ ఫుల్లు.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
29 September 2026
తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ ప్రియాంక జవాల్కర్. 'టాక్సీవాలా' సినిమాతో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
తొలి సినిమాతోనే మంచి నటిగా మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 'తిమ్మరుసు', 'ఎస్ఆర్ కల్యాణమండపం' వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.
తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఈ భామకు అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.
సినీ ఆఫర్లు పెద్దగా లేకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రియాంక ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. వరుస ఫోటోషూట్‌లతో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటోంది.
తాజాగా ఈ సుందరి షేర్ చేసిన పింక్ సారీ ఫోటోషూట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ట్రాన్స్‌పరెంట్ పింక్ కలర్ చీరలో, స్టైలిష్ బ్లౌజ్‌తో గ్లామరస్ పోజులు ఇచ్చింది.
అటు ట్రెడిషనల్ లుక్, ఇటు హాట్ గ్లామర్ ఫోజులతో తన అందంతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పింక్ కలర్ చీరలో దేవకన్యలా మెరిసిపోతూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.
ఈ ఫోటోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. 'గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా..', 'త్వరలోనే మంచి అవకాశాలు వస్తాయి' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సినిమా అవకాశాలు నిల్ అయినప్పటికీ, గ్లామర్ షోలో మాత్రం ఎక్కడా తగ్గనంటోంది ఈ అనంతపురం భామ. తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో కట్టిపడేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్