AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: తిరుమల శ్రీవారికి నయనతార తలనీలాలు సమర్పించారా? ఫొటోస్ వైరల్.. అసలు విషయమిదే

టాక్సిక్' సినిమా విడుదలకు ముందు, స్టార్ హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు ఏఐ (AI) టెక్నాలజీని ఉపయోగించి ఎడిట్ చేసిన మార్ఫింగ్ ఫొటోలని తెలుస్తోంది.

Nayanthara: తిరుమల శ్రీవారికి నయనతార తలనీలాలు సమర్పించారా? ఫొటోస్ వైరల్.. అసలు విషయమిదే
Nayanthara
Basha Shek
|

Updated on: Aug 18, 2026 | 7:02 PM

Share

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన ‘టాక్సిక్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈలోగా ఈ స్టార్ హీరోయిన్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో పూర్తి గుండుతో ఉన్న నయనతార ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది మంది వీటిని చూసి నయనతార నిజంగానే తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిందనుకున్నారు. అయితే ఈ వైరల్ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉంది. అదేంటంటే.. ఈ ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి మార్ఫింగ్ చేశారు. గతంలో తిరుమలకు వెళ్లిన నయనతార పాత ఫొటోలను ఎడిట్ చేశారు నెట్టింట వైరల్ చేశారు. నయనతార ఈ ఏడాది ఏప్రిల్‌లో తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి తిరుమలను సందర్శించారు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా విడుదలకు ముందు ఈ దంపతులు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో నయనతార తెలుపు రంగు కుర్తా, లెగ్గింగ్స్‌తో పాటు ఆకుపచ్చ రంగు దుపట్టాలో కనిపించారు. అయితే అప్పటి ఫొటోలను తీసుకుని నయనతార తలనీలాలు సమర్పించినట్లుగా ఏఐ టెక్నాలజీతో మార్చి, ఆ వీడియో, ఫోటోలను నెట్టింట వైరల్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా గతంలోనూ చాలా మంది హీరోయిన్ల ఫొటోలను ఇలాగే ఎడిట్ చేసి వైరల్ చేశారు కొందరు నెటిజన్లు. రష్మిక మందన్నా, అలియా భట్, రుక్మిణి వసంత్ తదితర స్టార్ హీరోయిన్ల ముఖాలు, శరీరాలను అశ్లీల ఫొటోలు, వీడియోలకు జోడిస్తూ డీప్ ఫేక్ విజువల్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నయనతార విషయంలోనూ అదే జరిగింది. ఈ క్రమంలో ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను నమ్మవద్దని అలాగే షేర్ కూడా చేయవద్దని నయనతార అభిమానులు కోరుతున్నారు.

నెట్టింట వైరలవుతోన్న నయనతార ఫొటోలు ఇవే..

ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార నటించిన టాక్సిక్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.యశ్ ఇందులో హీరోగా నటించాడు. దీని తర్వాత సల్మాన్ ఖాన్ చిత్రంలో నయనతార హీరోయిన్ గా చేస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అప్పటి ఫొటోలను ఇప్పుడు మార్ఫింగ్ చేసి..

View this post on Instagram

A post shared by tirupatilo (@tirupatilo)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..
తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..
చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ
చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ
కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..
కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..
అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..
అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..
భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం
భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం
వేడి వేడి అన్నంలోకి.. కారం కారం టమాటా ఉల్లికారం, నోరూరడం గ్యారంటీ
వేడి వేడి అన్నంలోకి.. కారం కారం టమాటా ఉల్లికారం, నోరూరడం గ్యారంటీ
సామాన్యులపై వార్ ఎఫెక్ట్.. పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
సామాన్యులపై వార్ ఎఫెక్ట్.. పెరగనున్న ఆ వస్తువుల ధరలు..
వైన్‌ షాప్‌లో దూరిన కోతి.. మందు బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసింది
వైన్‌ షాప్‌లో దూరిన కోతి.. మందు బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసింది
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో ఓ మార్పుతో బరిలోకి భారత జట్టు..?
IND vs WI 2nd ODI: రెండో వన్డేలో ఓ మార్పుతో బరిలోకి భారత జట్టు..?
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!
దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం!