AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: రూ.30 లక్షల శాలరీ ఉన్నా ITR దాఖలు చేయలేదు.. రూ.3.74 లక్షల పెనాల్టీ రద్దు.. కారణం ఏంటంటే..

Income Tax: పన్ను చెల్లింపుదారులు గ్రహించాల్సిన విషయం ఏంటంటే.. జీతం నుంచి టీడీఎస్‌ కట్ అయినప్పటికీ ప్రతిఒక్కరూ ఐటీఆర్ ఫైల్ చేయడమే చట్టబద్ధమైన పద్ధతి. అయితే పన్ను చెల్లింపుదారుడు తన పూర్తి సమాచారాన్ని వెల్లడించి, ఇప్పటికే టీడీఎస్‌ చెల్లించి ఉన్నట్లయితే.. కేవలం ఆలస్యంగా..

Income Tax: రూ.30 లక్షల శాలరీ ఉన్నా ITR దాఖలు చేయలేదు.. రూ.3.74 లక్షల పెనాల్టీ రద్దు.. కారణం ఏంటంటే..
Income Tax
Subhash Goud
|

Updated on: Aug 18, 2026 | 7:54 PM

Share

Income Tax: ఆదాయపు పన్ను వివరాలు (ITR) సమయానికి దాఖలు చేయలేదనే కారణంతో ఒక ఉద్యోగికి వేసిన రూ. 3,74,072 పిరామిడ్ పెనాల్టీని ఢిల్లీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) రద్దు చేసింది. సమయానికి ITR ఫైల్ చేయకపోవడం, ఆదాయాన్ని తక్కువగా చూపించడం రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేస్తూ ఈ కీలక తీర్పు ఇచ్చింది.

అసలు ఏం జరిగింది?

ఉద్యోగి కేస్ వివరాలను పరిశీలిస్తే.. ప్రవేష్ అగర్వాల్ అనే ఉద్యోగి అస్సెస్మెంట్ ఇయర్ (AY) 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 30,22,900 వార్షిక జీతం పొందుతున్నారు. ఆ సంవత్సరంలో ఆయన ఉద్యోగం మారడం వల్ల కంపెనీల నుంచి సమయానికి Form-16 లభించలేదు. ఆయన రెండు కంపెనీలు జీతం నుండి TDS ని కట్ చేశాయి. అలాగే అది ఆయన Form 26AS లో స్పష్టంగా కనిపిస్తోంది. పన్ను ఇప్పటికే ప్రభుత్వానికి జమ అయ్యిందనే భావనతో ఆయన సమయానికి ఐటీఆర్‌ ఫైల్ చేయలేదు.

ఐటీ శాఖ నోటీసులు, పెనాల్టీ

రూ.30 లక్షలకు పైగా ఆదాయం ఉన్నా ఐటీఆర్‌ దాఖలు చేయలేదని గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ, సెక్షన్ 148 కింద ఆయనకు రీ-అస్సెస్మెంట్ నోటీసు పంపింది. నోటీసు వచ్చిన వెంటనే ఆయన తన పూర్తి ఆదాయాన్ని (రూ. 30.22 లక్షలు) వివరంగా వెల్లడిస్తూ ITR సమర్పించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Biryani Recipe: వారి జీవితాన్నే మార్చేసిన అమ్మమ్మ బిర్యానీ రెసిపీ.. రూ.5 లక్షల పెట్టుబడితో రూ.10 కోట్ల వ్యాపారం.. అక్కాచెల్లెళ్ల సక్సెస్‌ స్టోరీ

అస్సెసింగ్ ఆఫీసర్ (AO) ఆయన చూపించిన ఆదాయంలో ఎలాంటి మార్పులు లేకుండా పూర్తి మొత్తాన్ని అంగీకరించారు. అయితే, అసలు గడువులోగా ITR ఫైల్ చేయలేదు కాబట్టి, ఇది “ఆదాయాన్ని తక్కువ చేసి చూపించడమే” అవుతుందని భావించి సెక్షన్ 270A కింద రూ. 3.74 లక్షల భారీ పెనాల్టీ విధించారు.

ITAT ఇచ్చిన తీర్పు ఏమిటి?

ఐటీ శాఖ విధించిన పెనాల్టీని సవాలు చేస్తూ బాధితుడు ఢిల్లీ ITATని ఆశ్రయించారు. కేసును పరిశీలించిన ట్రిబ్యునల్ ఈ క్రింది అంశాలను ప్రామాణికంగా తీసుకుని పెనాల్టీని రద్దు చేసింది:

  • ఆదాయం దాచలేదు: నోటీసు అందిన తర్వాత ఉద్యోగి చూపించిన మొత్తం ఆదాయాన్ని ఐటీ శాఖ ఏ రకమైన కోతలు లేకుండా ఆమోదించింది. అంటే ఆయన అసలు ఆదాయం కంటే తక్కువగా ఏమీ చూపించలేదు.
  • TDS జమ అయ్యింది: పన్ను ఇప్పటికే TDS రూపంలో ప్రభుత్వానికి డిపాజిట్ అయిందని Form 26AS ఆధారంగా నిరూపణ అయ్యింది.
  • సాంకేతిక లోపం మాత్రమే: “నెలవారీ పన్నులు (TDS) కట్ అయిన తర్వాత కూడా ITR ఫైల్ చేయకపోవడం ఒక విధానపరమైన పొరపాటు కావచ్చు. కానీ దానిని ‘ఆదాయాన్ని దాచేయడం’ లేదా ‘తక్కువ చేసి చూపించడం’ అని అనలేము” అని ITAT స్పష్టం చేసింది.

పన్ను చెల్లింపుదారులు గ్రహించాల్సిన విషయం:

జీతం నుంచి టీడీఎస్‌ కట్ అయినప్పటికీ ప్రతిఒక్కరూ ఐటీఆర్ ఫైల్ చేయడమే చట్టబద్ధమైన పద్ధతి. అయితే పన్ను చెల్లింపుదారుడు తన పూర్తి సమాచారాన్ని వెల్లడించి, ఇప్పటికే టీడీఎస్‌ చెల్లించి ఉన్నట్లయితే.. కేవలం ఆలస్యంగా దాఖలు చేసినందుకు సెక్షన్ 270A కింద భారీ పెనాల్టీలు విధించడం సరికాదని ఈ తీర్పు తేల్చిచెప్పింది.

ఇది కూడా చదవండి: Best Bike: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us