తెర వెనుక బాగోతం ఎందుకు – లారెన్స్

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాఘవ లారెన్స్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా సౌత్ హిట్ మూవీ ‘కాంచన’కు రీమేక్. ఇది ఇలా ఉంటే రాఘవ లారెన్స్ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. తనతో చర్చించకుండా, తనకు తెలియకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారనే కారణం వల్లే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు లారెన్స్ ప్రకటించాడు. ఇక హీరో అక్షయ్ […]

తెర వెనుక బాగోతం ఎందుకు - లారెన్స్
Ravi Kiran

| Edited By: Srinu Perla

May 21, 2019 | 7:30 PM

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాఘవ లారెన్స్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా సౌత్ హిట్ మూవీ ‘కాంచన’కు రీమేక్. ఇది ఇలా ఉంటే రాఘవ లారెన్స్ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. తనతో చర్చించకుండా, తనకు తెలియకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారనే కారణం వల్లే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు లారెన్స్ ప్రకటించాడు. ఇక హీరో అక్షయ్ కుమార్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఘవ లారెన్స్ వెల్లడించాడు.

అసలు దర్శకుడికి తెలియకుండా ఫస్ట్ లుక్‌ను ఎలా రిలీజ్ చేస్తారు.? ఈ విషయం ఓ దర్శకుడిగా నన్ను చాలా బాధించింది. ఇప్పటి వరకూ  కూడా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ ఘటనతో నేనో మూర్ఖుడిలా ఫీలయ్యేలా చేశారు. నన్ను గౌరవించాల్సిన అవసరం లేదని అనుకున్నారేమో అని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ డైరెక్టర్‌గా సినిమాకు సంబంధించిన విషయాలు నాకు అప్డేట్ చేస్తే చాలు. అంతేగానీ నా వెనక చాటుగా చేయకూడదు అని అన్నారు. నిర్మాణ సంస్థతో ఏదన్నా సమస్యలు వస్తే అవన్నీ నా తరపు న్యాయవాది చూసుకుంటాడు. ఇకపోతే నాకు అక్షయ్ కుమార్‌తో ఎటువంటి సమస్యలు లేవు. ఈ ఘటన వల్ల తప్పు చేశానన్న భావన ఆయనలో కలుగకూడదు. ఎందుకంటే ఈ పాత్ర కోసం ఆయన చాలా కాలంగా కష్టపడుతున్నారు. అందుకే ఆయన కోసం నా స్క్రిప్ట్‌ను తిరిగి ఇచ్చేయాలని అడగడం లేదని లారెన్స్ వెల్లడించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu