భయపెడుతున్న ‘కాంచన 3’ ట్రైలర్‌

భయపెడుతున్న ‘కాంచన 3’ ట్రైలర్‌

చెన్నై: కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభించిన రాఘవా లారెన్స్‌..ఆ తర్వాతి కాలంలో హీరోగా, దర్మకుడిగా, నిర్మాతగా మంచి విజయాలు అందుకున్నాడు. ముఖ్యంగా ఆయన హీరోగా నటిస్తూ.. తెరకెక్కించిన కామెడీ హర్రర్ సినిమాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. అందుకే లారెన్స్ ‘ముని’ సిరీస్‌ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఇదే సిరీస్‌లో ‘కాంచన 3’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా.. చిత్ర ట్రైలర్‌ తాజాగా రిలీజయ్యింది. భయంకరమైన ఇల్లు, అందులోని దెయ్యాల పాత్రల పరిచయాలతో ట్రైలర్‌ మొదలైంది. లారెన్స్‌ […]

Ram Naramaneni

| Edited By: Vijay K

Mar 28, 2019 | 6:53 PM

చెన్నై: కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఆరంభించిన రాఘవా లారెన్స్‌..ఆ తర్వాతి కాలంలో హీరోగా, దర్మకుడిగా, నిర్మాతగా మంచి విజయాలు అందుకున్నాడు. ముఖ్యంగా ఆయన హీరోగా నటిస్తూ.. తెరకెక్కించిన కామెడీ హర్రర్ సినిమాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. అందుకే లారెన్స్ ‘ముని’ సిరీస్‌ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఇదే సిరీస్‌లో ‘కాంచన 3’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా.. చిత్ర ట్రైలర్‌ తాజాగా రిలీజయ్యింది.

భయంకరమైన ఇల్లు, అందులోని దెయ్యాల పాత్రల పరిచయాలతో ట్రైలర్‌ మొదలైంది. లారెన్స్‌ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో కబీర్‌ దుహన్‌ సింగ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రాఘవ తెల్ల జుట్టు, గెడ్డంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. విలన్‌‌ని టార్గెట్ చేస్తూ  ‘నువ్వు మాసైతే నేను డబుల్‌ మాస్’ అని చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ నుంచి వస్తున్న ప్రతి సినిమాలో రాఘవ, కోవై సరళ పాత్రలు తప్ప ఇతర తారాగణం మారుతూ వస్తోంది.  సత్యరాజ్, శ్రీమాన్‌ ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు.  ‘కాంచన 3’కి తమన్‌ సంగీతం అందించారు. తమిళ బిగ్ బాస్ ఫేం ఓవియా, వేదిక రాఘవకు జోడీగా నటించారు.  ఏప్రిల్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి గత చిత్రాల తరహాలో ఈ మూవీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu