మెగా ఫోన్ పట్టనున్న కపిల్‌ దేవ్ కూతురు

భారత‌ దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్ కుమార్తె అమియా దేవ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే, నటిగా కాదు.. సహాయ దర్శకురాలిగా. 1983లో జరిగిన ప్రపంచకప్‌లో విండీస్‌ను ఓడించి దేశానికి ప్రపంచకప్ అందించి కపిల్ దేశానికి గర్వకారణంగా నిలిచాడు. ఇప్పుడు ఇదే కథాంశంగా తెరకెక్కబోతున్న ‘83’ సినిమాకు అమియా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయబోతోంది. ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్ కపిల్ దేవ్‌గా కనిపించనున్నాడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రానున్న ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కపిల్‌ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:28 pm, Thu, 28 March 19
మెగా ఫోన్ పట్టనున్న కపిల్‌ దేవ్ కూతురు

భారత‌ దిగ్గజ క్రికెటర్ కపిల్‌ దేవ్ కుమార్తె అమియా దేవ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే, నటిగా కాదు.. సహాయ దర్శకురాలిగా. 1983లో జరిగిన ప్రపంచకప్‌లో విండీస్‌ను ఓడించి దేశానికి ప్రపంచకప్ అందించి కపిల్ దేశానికి గర్వకారణంగా నిలిచాడు. ఇప్పుడు ఇదే కథాంశంగా తెరకెక్కబోతున్న ‘83’ సినిమాకు అమియా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయబోతోంది. ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్ కపిల్ దేవ్‌గా కనిపించనున్నాడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రానున్న ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కపిల్‌ దేవ్ కుమార్తె అమియా ఇటీవలే డిగ్రీ పూర్తిచేసుకుంది. బాల్యం నుంచి క్రికెట్‌తో అనుబంధం ఉన్న అమియా ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కథాంశం గురించి ఆమెకు పూర్తిగా అవగాహన ఉండడం తమకు లాభిస్తుందని ‘83’ వర్గాలు తెలిపాయి.