సాయిపల్లవితో పెళ్లి.. స్పందించిన దర్శకుడు

ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో మలార్ బ్యూటీ సాయి పల్లవి రిలేషన్‌లో ఉన్నట్లు ఇటీవల పుకార్లు గుప్పుమన్నాయి. విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి ‘దియ’(తెలుగులో కణం)చిత్రంలో నటించగా.. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపించాయి. దీంతో ఈ వార్తలపై తాజాగా విజయ్ స్పందించాడు. తాను, సాయి పల్లవి రిలేషన్‌లో లేమని ఆయన స్పష్టం చేశాడు. నాపై, సాయి పల్లవిపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:53 am, Fri, 29 March 19
సాయిపల్లవితో పెళ్లి.. స్పందించిన దర్శకుడు

ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో మలార్ బ్యూటీ సాయి పల్లవి రిలేషన్‌లో ఉన్నట్లు ఇటీవల పుకార్లు గుప్పుమన్నాయి. విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి ‘దియ’(తెలుగులో కణం)చిత్రంలో నటించగా.. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపించాయి. దీంతో ఈ వార్తలపై తాజాగా విజయ్ స్పందించాడు.

తాను, సాయి పల్లవి రిలేషన్‌లో లేమని ఆయన స్పష్టం చేశాడు. నాపై, సాయి పల్లవిపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని విజయ్ తెలిపాడు. అయితే ఈ వార్తలపై సాయి పల్లవి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

కాగా ప్రముఖ నటి అమలా పాల్‌తో విడాకులు తీసుకున్న విజయ్.. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉన్నాడు. అప్పుడప్పుడు ఆయన పెళ్లిపై వార్తలు వస్తున్నా.. తాను మరో పెళ్లి చేసుకునేందుకు ఇప్పట్లో సిద్ధంగా లేనని విజయ్ పలుమార్లు వెల్లడించాడు.

మరోవైపు తనకు పెళ్లి చేసుకోవాలని లేదని సాయి పల్లవి కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన తల్లిదండ్రులతో ఉండాలని తనకు ఉందని, వారిని బాగా చూసుకోవాలనుకుంటున్నానని, అందుకే పెళ్లి చేసుకోవాలని లేదని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే.