ఆర్ఆర్ఆర్‌: భారీ షెడ్యూల్‌ కోసం బయలుదేరామన్న ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్‌: భారీ షెడ్యూల్‌ కోసం బయలుదేరామన్న ఎన్టీఆర్

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్‌లు హైదరాబాద్‌లో పూర్తయ్యాయి. ఇక తదుపరి షెడ్యూల్‌ను వడోదరాలో ప్లాన్ చేశాడు దర్శకుడు రాజమౌళి. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ వడోదరాకు బయలుదేరింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘‘బిగ్ షెడ్యూల్‌ కోసం వెళుతున్నాం’’ అంటూ కామెంట్ పెట్టిన ఎన్టీఆర్.. వారి టికెట్ల ఫొటోలను షేర్ చేశాడు. Off to a flying […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 6:42 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్‌లు హైదరాబాద్‌లో పూర్తయ్యాయి. ఇక తదుపరి షెడ్యూల్‌ను వడోదరాలో ప్లాన్ చేశాడు దర్శకుడు రాజమౌళి. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ వడోదరాకు బయలుదేరింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘‘బిగ్ షెడ్యూల్‌ కోసం వెళుతున్నాం’’ అంటూ కామెంట్ పెట్టిన ఎన్టీఆర్.. వారి టికెట్ల ఫొటోలను షేర్ చేశాడు.

ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుండగా వారు కూడా ఈ షెడ్యూల్‌లో భాగం కానున్నారు. అలాగే ఈ మూవీలో కీలక పాత్రలలో కనిపిస్తోన్న అజయ్ దేవగన్, సముద్ర ఖని కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. కాగా రియల్ పాత్రలతో కూడిన ఫిక్షన్ కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu