మధ్యప్రదేశ్లోని రణ్పూర్ గ్రామంలో అంగన్వాడీ వంట మనిషి కంచన్బాయ్ అసాధారణ ధైర్యం ప్రదర్శించారు. 20 మంది చిన్నారులపై తేనెటీగల దాడి చేయగా, ఆమె తన ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. పిల్లలను సురక్షితంగా లోపలికి పంపించిన తర్వాత, తీవ్రమైన తేనెటీగల కాట్లతో ఆమె స్పృహ తప్పి, చివరకు మరణించారు. ఆమె త్యాగం స్థానికంగా విషాదాన్ని నింపింది.