AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ఏడు గుర్రాల పెయింటింగ్ మీ తలరాతను మారుస్తుందా? వాస్తు నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలు!

చాలా మంది ఇళ్లలో లేదా ఆఫీసుల్లో ఏడు గుర్రాలు సముద్రంపై లేదా మైదానంలో పరుగెత్తుతున్న పెయింటింగ్‌ను మనం చూస్తుంటాం. దీనిని చాలా మంది ఒక అందమైన అలంకరణ వస్తువుగా మాత్రమే భావిస్తారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిత్రానికి అపారమైన శక్తి ఉంది. గుర్రం అనేది వేగానికి, పట్టుదలకు విజయానికి ప్రతీక. సరైన పద్ధతిలో ఈ పెయింటింగ్‌ను ఏర్పాటు చేసుకుంటే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, కెరీర్‌లో ఊహించని ఎదుగుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Vastu Tips : ఏడు గుర్రాల పెయింటింగ్ మీ తలరాతను మారుస్తుందా? వాస్తు నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలు!
Running Horses Painting Vastu
Bhavani
|

Updated on: Feb 06, 2026 | 3:51 PM

Share

భారతీయ సంస్కృతిలో 7 సంఖ్యకు ఎంతో పవిత్రత ఉంది. ఇంద్రధనస్సు రంగులు, సప్తఋషులు, పెళ్లిలో ఏడు అడుగులు.. ఇలా ప్రతిచోటా ఏడు కనిపిస్తుంది. సూర్య భగవానుడి రథాన్ని కూడా ఏడు గుర్రాలు లాగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే, కలిసి పరిగెత్తుతున్న 7 గుర్రాల చిత్రం ఇంటికి సానుకూలతను తీసుకువస్తుంది. అయితే, ఈ పెయింటింగ్‌ను ఏ దిశలో ఉంచాలి? గుర్రాలు ఎలా ఉండాలి? వంటి నియమాలను పాటించకపోతే ఆశించిన ఫలితం రాదు. ఆ ఆసక్తికర విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఏడు గుర్రాల పెయింటింగ్ వల్ల కలిగే 3 ప్రధాన లాభాలు:

ఆర్థిక అభివృద్ధి:

వ్యాపారంలో నష్టాలు వస్తున్నా లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నా ఈ పెయింటింగ్ అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఇది మీ ప్రయత్నాలకు గుర్రపు వేగాన్ని ఇస్తుంది.

స్తబ్దతకు చెక్:

ఇంట్లో ఎప్పుడూ బద్ధకం, ప్రతికూల ఆలోచనలు ఉంటే.. ఈ పరిగెత్తే గుర్రాల చిత్రం ఆ ప్రదేశంలోని శక్తిని మార్చేస్తుంది. ఇది కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

మానసిక ప్రశాంతత:

నారింజ లేదా ఎరుపు రంగుల నేపథ్యం ఉన్న చిత్రం ఆత్మవిశ్వాసాన్ని పెంచితే, నీలి ఆకాశం నేపథ్యం ఉన్న చిత్రం మనసుకు శాంతిని, ఏకాగ్రతను అందిస్తుంది.

వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి?

దక్షిణ దిశ : కీర్తి, ప్రతిష్టలు విజయం కోసం దక్షిణ గోడపై ఈ చిత్రాన్ని వేలాడదీయాలి. గుర్రాలు ఉత్తరం వైపు పరుగెత్తుతున్నట్లు ఉండాలి.

తూర్పు దిశ : కెరీర్‌లో లేదా వ్యక్తిగత జీవితంలో వేగంగా ముందుకు సాగాలనుకునే వారు తూర్పు దిశలో ఉంచవచ్చు.

ముఖ్య నియమం:

గుర్రాలు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా ఉండాలి కానీ, తలుపు లేదా కిటికీ వైపు (బయటకు వెళ్తున్నట్లు) ఉండకూడదు. ఇలా ఉంటే అదృష్టం ఇంటి నుండి బయటకు వెళ్తుందని అర్థం.

పెయింటింగ్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

గుర్రాల ముఖాలు సంతోషంగా ఉండాలి, కోపంగా లేదా దూకుడుగా ఉండకూడదు.

గుర్రం కాళ్లు, తోక వంటి అన్ని భాగాలు స్పష్టంగా కనిపించాలి.

ఎప్పుడూ ఒకే గుర్రం ఉన్న బొమ్మను లేదా ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లు ఉన్న చిత్రాలను పెట్టకూడదు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వాస్తు ఫలితాలు అనేవి మీ ఇంటి నిర్మాణం మరియు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి.