AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leo Movie: లియో రిలీజ్‌పై తొలగిపోయిన అనుమానాలు.. విడుదలపై అధికారిక ప్రకటన..

అయితే తెలుగులో ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో లియో సినిమా విడుదల ఆపేయాలి తెలంగాణ సివిల్ కోర్ట్ నోటీసునిచ్చింది. సినిమా వాయిదా వేస్టూ స్టే ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ అనుమానాలన్నింటికీ చెక్‌ పెడుతూ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తెలుగులో టైటిల్‌ విషయంలో సమస్యలను పరిష్కరించుకున్నట్లు తెలిపిన నిర్మాత లియో తెలుగును...

Leo Movie: లియో రిలీజ్‌పై తొలగిపోయిన అనుమానాలు.. విడుదలపై అధికారిక ప్రకటన..
Leo Movie
Narender Vaitla
|

Updated on: Oct 17, 2023 | 5:08 PM

Share

దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం లియో. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి భారీ తారాగణంతో పాన్‌ ఇండియా చిత్రంగా ఈ సినిమాను విడుదల చేయునన్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తెలుగులో ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో లియో సినిమా విడుదల ఆపేయాలి తెలంగాణ సివిల్ కోర్ట్ నోటీసునిచ్చింది. సినిమా వాయిదా వేస్టూ స్టే ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ అనుమానాలన్నింటికీ చెక్‌ పెడుతూ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తెలుగులో టైటిల్‌ విషయంలో సమస్యలను పరిష్కరించుకున్నట్లు తెలిపిన నిర్మాత లియో తెలుగును అక్టోబర్‌ 19వ తేదీన విడుదల చేయనున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించారు.

లియో చిత్రం తెలుగులో అక్టోబర్‌ 19వ తేదీన ఉదయం 7 గంటల షోతో విడుదలవుతుందని, దసరా సెలవుల్లో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలుగు టైటిల్‌ విషయంలో నెలకొన్న సమస్యపై మాట్లాడాని నిర్మాత.. తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారని. వారు తమను సంప్రదించకుండానే నేరుగా కోర్టుని ఆశ్రయించనట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాము మీడియా ద్వారానే తెలుసుకున్నామని, టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకున్న వారితో మాట్లాడుతున్నానని తెలిపారు. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పుకొచ్చారు.

ఇక లియో తెలుగు టైటిల్‌ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్‌ చేయించారన్న నాగవంశీ.. ఈ సినిమా సెన్సార్‌ కూడా ఇప్పటికే పూర్తయిందని, కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదని క్లారిటీ ఇచ్చారు. లియో చాలా బాగుటుందన్న నమ్మకంతోనే తెలుగు హక్కులను కొనుగోలు చేశామని తెలిపిన నిర్మాత, దర్శకుడు లోకేష్ ప్రేక్షకులను నిరాశపరచరని ధీమా వ్యక్తం చేశారు. ఇక థియేటర్ల విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదన్న నిర్మాత నాగవంశీ.. లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు ఎటువంటి సమస్య ఉండదని తెలిపారు. ఇతర సినిమాలు కూడా భారీ విజయాన్ని సాధించాలని తాము ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

లియో సినిమా ట్రైలర్..

ఇక తామ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సార్‌ చిత్రాన్ని తమిళ్‌లో లలిత్‌ కుమార్‌ విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్న నిర్మాత నాగవంశీ.. ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతోనే ఇప్పుడు తెలుగులో లియో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక దసరా నాటికి గుంటూరు కారం మొదటి పాట విడుదల ఎప్పుడనేది తెలియజేస్తామని నిర్మాత నాగ వంశీ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..