Copper Coins: నీటిలో నాణేలు వేయడం మూఢనమ్మకమా?.. దీని వెనుక ఉన్న షాకింగ్ సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా?
మన భారతీయ సంస్కృతిలో నదులు లేదా ప్రవహించే నీటిని అత్యంత పవిత్రంగా భావిస్తాం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు లేదా నదులను దాటేటప్పుడు నీటిలో రాగి నాణెం వేయడం మన పెద్దల నుండి వస్తున్న ఒక ఆచారం. అయితే, ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. దీని వెనుక లోతైన జ్యోతిష్య శాస్త్ర మూలాలు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. జాతక చక్రంలో గ్రహ దోషాలను తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఈ పరిహారం దివ్యౌషధంలా పనిచేస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాగి లోహం సూర్యుడు కుజుడికి చిహ్నం. ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలహీనంగా ఉంటే, వారికి సమాజంలో గౌరవం తగ్గడం, ఆరోగ్య సమస్యలు పితృ దోషాలు ఎదురవుతాయి. ప్రవహించే నీటికి రాగి నాణెం సమర్పించడం ద్వారా ఆ దోషాల నుండి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే, పూర్వకాలంలో నదీ జలాలను శుద్ధి చేయడానికి ఈ పద్ధతిని వాడేవారని సైన్స్ చెబుతోంది. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రాగి నాణెం పరిహారం – కలిగే ప్రయోజనాలు:
సూర్య కుజ దోషాల నివారణ: జాతకంలో సూర్యుడు బలోపేతం కావడం వల్ల సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. అంగారక (కుజ) ప్రభావం వల్ల కలిగే కోపం, రుణ సమస్యలు తగ్గుతాయి.
పితృ దోష నివారణ: జీవితంలో ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే, ప్రవహించే నీటిలో రాగి నాణెంతో పాటు కొన్ని మెంతి గింజలను సమర్పించడం వల్ల పితృ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మనసుకి ప్రశాంతతను ఇస్తుంది.
ఆర్థిక అభివృద్ధి: నడుస్తున్న నీటిని ప్రగతికి చిహ్నంగా భావిస్తారు. నాణెం ప్రవాహంలో కదలడం మీ జీవితంలో ఆర్థిక ప్రవాహాన్ని సులభతరం చేస్తుందని నమ్మకం.
శాస్త్రీయ కోణం: పూర్వ కాలంలో తాగునీటి వనరులైన నదుల్లో రాగి నాణేలు వేసేవారు. రాగికి నీటిని శుద్ధి చేసే గుణం ఉంది. ఇది నీటిలోని హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
ఎలా చేయాలి?
ఈ పరిహారం చేయడానికి ఆదివారం లేదా మంగళవారం అత్యంత శుభప్రదమైన రోజులు.
స్నానం చేసిన తర్వాత, శుభ్రమైన వస్త్రాలు ధరించి తూర్పు ముఖంగా నిలబడాలి.
మీ మనస్సులో కులదైవాన్ని ప్రార్థిస్తూ, రాగి నాణేన్ని ప్రవహించే నీటిలో వేయాలి.
నాణెం మట్టిలో పాతుకుపోకుండా, నీటి ప్రవాహంతో ముందుకు వెళ్లేలా చూసుకోవడం మంచిది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పైన పేర్కొన్న విషయాలు జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం మరియు నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి.
