AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఇలా అవుతుందని కలలో కూడా ఉహించలేదంటున్న హీరోయిన్

ఇటీవల ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పెళ్లి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది మరికొంతమంది పెళ్ళికి రెడీ అవుతున్నారు. అయితే ఓ హీరోయిన్ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా అని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఇలా అవుతుందని కలలో కూడా ఉహించలేదంటున్న హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2026 | 8:03 AM

Share

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, హీరోయిన్స్ ప్రేమాయణాలు, పెళ్లి, విడాకులు వంటివి నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఉంటాయి. ఇటీవల కొంతమంది సెలబ్రెటీలు రీసెంట్ గా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. అలాగే కొంతమంది ప్రేమాయణం మొదలు పెట్టి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక ఇటీవలే ఓ హీరోయిన్ పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్నందుకు అభిమానులు కొంత బాధపడ్డప్పటికీ.. మరో వైపు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇంట్లో పెద్ద వాళ్లు పెళ్లి చేయకపోతే.. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుందట ఆ హీరోయిన్. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే..

తెలుగులో తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో కీర్తిసురేష్ ఒకరు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇక మహానటి సినిమాతో తెలుగులో ప్రేక్షకులకు మరింత దగ్గరైయింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించింది కీర్తిసురేష్. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అందాల భామ. గత ఏడాది పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది.

తన ప్రియుడు ఆంటోని తటిల్ ను కీర్తి 2024లో వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయల ప్రకారం జరిగింది. దాదాపు 15 ఏళ్లు రిలేషన్ లో ఉన్న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యాక్టివ్ గా ఉంది కీర్తి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులను అలరించింది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. కీర్తిసురేష్ మాట్లాడుతూ.. ఆంటోనీ గురించి తన ఇంట్లో తెలిస్తే ఖచ్చితంగా మా పెళ్లికి ఒప్పుకోరని అనుకున్నాం.. ఒకవేళ మా పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాము.  కానీ మా ప్రేమ గురించి చెప్పగానే పెద్దలు పెళ్లి ని అంగీకరించి ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేశారు. ఇంత గ్రాండ్ గా మా ఫ్యామిలీస్ సమక్షంలో మా పెళ్లి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.. అందుకే పెళ్లి సమయంలో నేను నా భర్త ఎమోషనల్ అయ్యాం అని తెలిపింది కీర్తిసురేష్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..