Sravana Bhargavi: చిన్న చిన్న గొడవలు కామన్.. కానీ చివరకు.. సింగర్ శ్రావణ భార్గవి..
టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె పాటలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. తన ప్రేమ, పెళ్లి, మనస్పర్థల గురించి అనేక విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సింగర్ శ్రావణ భార్గవి గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తల్లిదండ్రులతో తన అనుబంధం, స్వతంత్ర సంగీత పరిశ్రమలో ఎదురవుతున్న సవాళ్లను ఆమె స్పష్టంగా వివరించారు. తల్లితో తన టీనేజ్ అనుభవాల గురించి మాట్లాడుతూ, తల్లి కూతుళ్ల మధ్య అభిప్రాయ భేదాలు సహజమని పేర్కొన్నారు. తన తల్లి నేరుగా మాట్లాడే విధానం టీనేజ్ లో తనకు నచ్చేది కాదని, కానీ ఇప్పుడు తాను తల్లిగా మారిన తర్వాత తన కూతురితోనూ అదేవిధంగా వ్యవహరిస్తున్నానని, అప్పుడు తన తల్లి పడిన ఇబ్బందిని అర్థం చేసుకోగలుగుతున్నానని తెలిపారు. తన తల్లి సహనం, ప్రేమను ఆమె కొనియాడారు.
తండ్రితో తన అనుబంధం 20 ఏళ్లు దాటిన తర్వాత మరింత స్నేహపూర్వకంగా మారిందని చెప్పారు. తండ్రి ప్రేమను ఖరీదైన వస్తువులు కొని ఇవ్వడం ద్వారా వ్యక్తపరిచేవారని, అప్పుడు దానిని కఠినంగా భావించినప్పటికీ, ఇప్పుడు అది ఆయన ప్రేమను చూపించే విధానమని గ్రహించానని అన్నారు. తెలుగు సంగీత పరిశ్రమలో స్వతంత్ర మ్యూజిక్ లేబుల్స్ లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలపై శ్రావణ భార్గవి ప్రధానంగా దృష్టి సారించారు. నార్త్ ఇండియాలో డిఫ్ జామ్, వార్నర్ మ్యూజిక్, యూనివర్సల్ మ్యూజిక్ వంటి అనేక లేబుల్స్ ఉన్నాయని, అలాగే తమిళనాడులో సంథోష్ నారాయణన్ పాటలను విడుదల చేసిన థింక్ ఇండి వంటి స్వతంత్ర లేబుల్స్ ఉన్నాయని ఆమె వివరించారు.
ఇవి కళాకారులకు రచయితలు, సంగీత నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, స్టూడియో సౌకర్యాలు, మార్కెటింగ్ వంటి అన్ని రకాల మద్దతును అందిస్తాయని అన్నారు. ఒక స్వతంత్ర కళాకారిణిగా, తాను స్వయంగా పాటలను వ్రాయడం, సంగీతం సమకూర్చడం, వీడియో షూట్ చేయడం, మార్కెటింగ్ చేయడం వంటి అన్ని బాధ్యతలను చూసుకోవాల్సి వస్తుందని ఆమె తెలియజేశారు. ఒక లేబుల్ ఉంటే, అది కళాకారుడి కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లగలదని ఆమె అభిప్రాయపడ్డారు. తెలుగులో అలాంటి లేబుల్స్ రాబోయే కాలంలో వస్తే చాలా సంతోషిస్తానని, అప్పటివరకు తన పాటలను తానే స్వయంగా విడుదల చేసుకుంటానని స్పష్టం చేశారు.
ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..
