- Telugu News Entertainment Tollywood Keerthy Suresh Birthday: Keerthy Suresh aspires to make her Bollywood debut
Keerthy Suresh: ఈ సారి పక్కా.. ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఫిక్స్ అయిన కీర్తి సురేష్
Keerthi Suresh Birthday: మహానటి సినిమాతో స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత అనుకున్న రేంజ్‌లో కెరీర్‌ను కంటిన్యూ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలన్న కీర్తి కల ఇంకా కలగానే ఉంది.
Updated on: Oct 17, 2023 | 5:06 PM

సౌత్‌లో హోమ్లీ ఇమేజ్‌తో ఆకట్టుకుంటున్న అందాల భామ కీర్తి సురేష్. మహానటి సినిమాతో స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత అనుకున్న రేంజ్‌లో కెరీర్‌ను కంటిన్యూ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలన్న కీర్తి కల ఇంకా కలగానే ఉంది.

సిల్వర్ స్క్రీన్ మీద కీర్తి చేస్తున్న ప్రయోగాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలు వర్క్ అవుట్ కాకపోవటంతో స్టార్ హీరోల సినిమాల్లో సిస్టర్ రోల్స్ కూడా ట్రై చేశారు ఈ బ్యూటీ. కానీ అవి కూడా కలిసి రాలేదు. దీంతో కెరీర్ విషయంలో డైలామాలో పడ్డ ఈ బ్యూటీ గ్లామర్ ఇమేజ్ మీద ఫోకస్ పెట్టారు.

త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న కీర్తి సురేష్, నార్త్ ఆడియన్స్‌ను మెప్పించేలా స్లిమ్ అండ్ ఫిట్ లుక్‌లోకి మారేందుకు కష్టపడుతున్నారు. చాలా రోజుల కిందటే అజయ్ దేవగన్ హీరోగా మొదలైన మైదాన్ సినిమాతో కీర్తి నార్త్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ టైమ్‌లో కీర్తి మరీ స్లిమ్‌గా మారిపోవటంతో మైదాన్ టీమ్ ఈ బ్యూటీని పక్కన పెట్టేసింది.

తాజాగా మరోసారి నార్త్ డెబ్యూ ఛాన్స్ రావటంతో ఈ సారి ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు కీర్తి సురేష్. ఈ బ్యూటీ నార్త్ డెబ్యూకి సౌత్ డైరెక్టర్ అట్లీ హెల్ప్ చేస్తున్నారు. రీసెంట్‌గా జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో సూపర్ హిట్ అందుకున్న అట్లీ నిర్మాతగా బీటౌన్‌లో జెండా పాతేందుకు రెడీ అవుతున్నారు. తాను తమిళ్‌లో రూపొందించిన తెరి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.

వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న తెరి రీమేక్‌తోనే కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఒరిజినల్‌లో సమంత పోషించిన పాత్రను నార్త్‌లో కీర్తి సురేష్ ప్లే చేస్తున్నారు. అందుకే ఆ క్యారెక్టర్‌కు తగ్గ గ్లామరస్ లుక్స్ కోసం ఇప్పుడు జిమ్‌లో చెమటోడుస్తున్నారు కీర్తి సురేష్.




