Priyanka Chopra: హైదరాబాద్ బిర్యానీకి ప్రియాంక చోప్రా ఫిదా… ‘అదిరిపోయింది’ అంటూ ఎక్స్‌లో పోస్ట్!
గ్గోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం హైదరాబాద్ చేరుకున్న హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా. అదిరిపోయింది’ అని తెలుగులో రాసి, హైదరాబాద్ బిర్యానీని ప్రపంచంలోనే బెస్ట్ అని పొగిడింది. ఈ ఒక్క ట్వీట్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది ప్రియాంక చోప్రా

హైదరాబాద్‌లో బిర్యానీ రుచి చూస్తే ఎవరైనా ఫిదా అవుతారు. ఇప్పుడు ఆ జాబితాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ కూడా చేరారు! ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబుతో ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (గ్లోబ్ ట్రాటర్) సినిమా కోసం హైదరాబాద్‌లో ఉన్న ప్రియాంక హైదరాబాద్ రుచులతో పాటు ఆతిథ్యాన్నీ ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే ప్రియాంకా చోప్రా మందాకిని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించి బిగ్ ఈవెంట్ జరగబోతున్న సంగతి తెలిసిందే నవంబర్ 15వ తేదీ గ్లోబ్ ట్రాటర్ పేరిట ఈ సినిమా వేడుక జరుగునుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాకు సంబంధించి గ్లింప్ కూడా విడుదల చేయబోతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతున్న భారీ ఈవెంట్‌కు 50 వేలకుపైగా ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఎస్‌ఎస్‌ఎంబీ29 సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. బుధవారం రాత్రి తన X ఖాతాలో ‘Ask PCJ’ సెషన్ పెట్టిన ప్రియాంకని ఓ ఫ్యాన్, ‘తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది? హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేశారా?’ అని అడిగాడు. దానికి ప్రియాంక ఇచ్చిన జవాబు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
“It’s still early days for me on the movie but it’s been Adiri poyindi!!!! Also the biryani is the best in the world in Hyderabad.”
‘అదిరిపోయింది’ అని తెలుగులో రాసి, హైదరాబాద్ బిర్యానీని ప్రపంచంలోనే బెస్ట్ అని పొగడటం… ఈ ఒక్క ట్వీట్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించేశారు ప్రియాంక. ఆ తర్వాత నిమిషాల్లోనే వేల సంఖ్యలో రిప్లైలు, బిర్యానీ ఫోటోలు, బెస్ట్ బిర్యానీ పాయింట్స్ సజెషన్స్‌తో X నిండిపోయింది.
అంతేకాదు, రాజమౌళితో పనిచేయడం గురించి మాట్లాడిన ప్రియాంక, ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా ద్వారా తిరిగి తాను భారతీయ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుందని తెలిపింది. ఇక రాజమౌళితో పనిచేయడం కష్టమా? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు కష్టమేమీ కాలేదని అయితే ఈ సినిమా కచ్చితంగా తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ సినిమా కోసం తాను తెలుగు కూడా నేర్చుకుంటున్నానని తెలుగులో డైలాగ్ చెప్పడం కోసం రాజమౌళి తనకు చాలా సహాయం చేస్తున్నారని కచ్చితంగా తెలుగు మాట్లాడటంలో మీ అందరి అంచనాలను చేరుకుంటాను అంటూ ఈ సినిమా కోసం తను పడుతున్న కష్టాలను పంచుకుంది పీసీ.




