మహేష్ కోసం ఫిక్స్ చేసిన టైటిల్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్.. ఆ సినిమా ఎదో తెలుసా.?
మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాహుబలి 1,2 అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రిలీజ్ చేయనున్నారు రాజమౌళి. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే మహేష్ బాబు కోసం అనుకున్న టైటిల్ తో ప్రభాస్ సినిమా చేసి హిట్ అందుకున్నారట.. ఆ సినిమా ఎదో తెలుసా.?
ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది
అవును మహేష్ బాబు కోసం రిజిస్టర్ చేయించిన సినిమా టైటిల్ ను ఆతర్వాత ప్రభాస్ సినిమాకు వాడారు. కట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమా టైటిల్ ను అప్పట్లో ఆర్ఆర్ మూవీ మేకర్స్ మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ చేయించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు హీరో, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా ఓ సినిమాను మొదలుపెడదాం అనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందట. అదే సమయంలో దశరద్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు ఆ టైటిల్ వెళ్ళింది.
ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా
ప్రభాస్ స్వయంగా తన సినిమాకు ఈ టైటిల్ బాగుంటుందని అడగడంతో ఆర్ఆర్ మేకర్స్ టైటిల్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట. అలా మహేష్ మూవీ టైటిల్ ప్రభాస్ చేతికి వెళ్ళింది. కాగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు ఆతర్వాత అతిధి అనే సినిమా చేశారు.ఎం యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనుంది.




