AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయాక 24గంటలు శవాన్ని చూడనివ్వలేదు.. ఎస్వీ రంగారావు జీవితంలో ఇంత జరిగిందా..!

విశ్వనట చక్రవర్తిగా సినిమా ఇండస్ట్రీలో చెరగని స్థాన్నాన్ని సొంతం చేసుకున్నారు ఎస్వీ రంగారావు. తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఎస్వీ రంగారావు, తన జీవితాంతం దర్బంతో, రాజసం తో జీవించారు. ఆయన వ్యక్తిత్వం, స్టైల్‌ను ఫాలోఅవ్వాలని చాలామంది ప్రయత్నించినా, అది సాధ్యం కాలేదు.

చనిపోయాక 24గంటలు శవాన్ని చూడనివ్వలేదు.. ఎస్వీ రంగారావు  జీవితంలో ఇంత జరిగిందా..!
Sv Rangarao
Rajeev Rayala
|

Updated on: May 20, 2026 | 12:16 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మహానటుడు ఎస్వీ రంగారావు. ఆయన మరణించి అర్ధ శతాబ్దం గడిచినా, ఆయన చేసిన పాత్రలు, చూపిన నటన నేటికీ సినీ అభిమానుల మదిలో నిలిచి ఉన్నాయి. పాత్రలో జీవించే నటుడిగా పేరుగాంచిన ఎస్వీఆర్, తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు. నర్తనశాల చిత్రంలోని కీచకుడి పాత్రకు జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ సినిమా ప్రదర్శనలో ఉత్తమ నటుడి అంతర్జాతీయ అవార్డును అందుకున్న ఏకైక భారతీయ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎస్వీఆర్ కేవలం హీరోలతో సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకునేవారు. ఆయన కోసం దర్శకులు ప్రత్యేకంగా పాత్రలను, రచయితలు భారీ డైలాగులను రాసేవారు. షావుకారు సినిమాతో సున్నపు రంగడు పాత్రలో మెప్పించిన ఎస్వీఆర్, ఆ తర్వాత జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. 1950ల నుంచి 1970ల వరకు తెలుగు, తమిళ భాషల్లో ఆయన లేని సినిమాను ఊహించడం కష్టంగా ఉండేది. శివాజీ గణేషన్ వంటి నటులు కూడా ఎస్వీఆర్ తో నటించేటప్పుడు అప్రమత్తంగా ఉండేవారంటే ఆయన నటన స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

అయితే, ఆయన వ్యక్తిగత జీవితం అనేక సవాళ్లతో నిండి ఉండేది. తన మనసుకు నచ్చిన రీతిలో వ్యవహరించే చిన్నపిల్లవాడి మనస్తత్వం ఆయనది. కోపం త్వరగా వచ్చి, అంతే త్వరగా చల్లారే స్వభావం. ఈ పరిస్థితులన్నీ ఇంట్లో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. ఈ వ్యక్తిగత సమస్యలు, అలవాట్లు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒకసారి హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉండగా గుండెపోటు రావడంతో ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించినా, ఎస్వీఆర్ వాటిని పాటించలేదు. తన అలవాట్లను, షూటింగ్‌లను వదులుకోలేదు. ముఖ్యంగా, యశోద కృష్ణ సినిమాలో కంసుడి పాత్రను వదులుకోవడానికి ఆయన అంగీకరించలేదు. అనారోగ్యాన్ని పక్కనపెట్టి, నిర్మాతలను ఒప్పించి మరీ ఆ పాత్రను పోషించారు. సినిమా అయ్యాక అమెరికా వెళ్లి బైపాస్ సర్జరీ చేయించుకోవాలని పిల్లలు ఎంత ఒత్తిడి తెచ్చినా, యశోద కృష్ణ పూర్తయ్యాక వెళ్తానని వారిని ఒప్పించారు.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

1974 జులై 18వ తేదీన ఆయన ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో నిద్రలేవగా, ఇంట్లో ఎదో గొడవ.. ఎస్వీ రంగారావు గారు మద్యం సీసాతో బాత్‌రూమ్‌లోకి వెళ్లారు. మద్యం పూర్తిగా సేవించిన తర్వాత తూలుకుంటూ బయటకు వచ్చి దుస్తులు ధరిస్తుండగా తూలి మంచంపై పడిపోయారు. ఆయన మరణవార్త తెలియగానే రామానాయుడు, వి. మధుసూదనరావు వంటి సినీ ప్రముఖులు రంగారావు ఇంటికి చేరుకున్నారు. అయితే, మొదట్లో సతీమణి లీలావతి పార్థివ దేహాన్ని ఎవరినీ చూడనివ్వలేదు. జాతకాలు, పూజలు, వ్రతాలు నమ్మే ఆమె, తన గురువు మరణించిన వ్యక్తిని బతికించగలరని నమ్మింది. గురువు పాండిచ్చేరిలో ఉండటంతో, ఆయన వస్తే తన భర్త బతుకుతాడనే పిచ్చి భ్రమలో ఉండి, కనీసం శవాన్ని చూడటానికి కూడా అనుమతిని ఇవ్వలేదట. చివరికి గురువు ఫోన్‌లో దొరకకపోవడంతో చేసేదేమీ లేక పార్థివ దేహాన్ని మేడపై నుంచి కిందకు తెచ్చి ఇంటి ముందున్న వసారాలో ఉంచడానికి అంగీకరించారట. చెన్నైలోని కన్నిమ్మపేట శ్మశానవాటికలో రంగారావు గారి అంత్యక్రియలు జరిగాయి. తమిళ నటుడు శివాజీ గణేషన్, హీరోయిన్ వాణిశ్రీ వంటి అనేక మంది సినీ ప్రముఖులు ఆయన అంతిమ దర్శనం కోసం బారులు తీరారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us