AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion: ఉల్లిపాయ కట్‌చేశాక చేతులకు స్మెల్ వస్తుందా.. జస్ట్‌ ఇలా చేయండంతే.. క్షణాల్లో మాయం

సాధారణంగా ఉల్లిపాయలు కోసినా, లేదా తిన్న తర్వాత వాటికి ఉండే ఘాటైన వాసన మన చేతులకు అలాగే ఉంటుంది. ఈ వాసన చాలా మందిని ఇబ్బందికి గురిచేస్తుంది. కాబట్టి చేతులు, నోటి నుండి వచ్చే ఈ తీవ్రమైన దుర్వాసనను సింపుల్‌గా ఎలా దూరం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Onion: ఉల్లిపాయ కట్‌చేశాక చేతులకు స్మెల్ వస్తుందా.. జస్ట్‌ ఇలా చేయండంతే.. క్షణాల్లో మాయం
How To Quickly Remove Onion Smell From Your Hands
Anand T
|

Updated on: May 20, 2026 | 12:27 PM

Share

సాధారణంగా ఉల్లిపాయను కోసినప్పుడు లేదా తిన్నప్పుడు అందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. దీనివల్ల శ్వాసలో చాలా సేపటి వరకు దుర్వాసన వస్తూనే ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు కోసేటప్పుడు ఆ వాసన చేతుల చర్మంలోకి ఇంకిపోతుంది, ఇది మామూలు సబ్బుతో కడిగినా పోదు. దీన్ని వదిలించుకోవడానికి కొన్ని సైంటిఫిక్, ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. అవేంటి.. వాటి ద్వారా వాసనను ఎలా దూరం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఉల్లిపాయ వాసనను ఇలా సింపుల్‌గా దూరం చేయండి

నారింజ, యాపిల్: హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. ఉల్లిపాయ తిన్న తర్వాత ఒక ఆపిల్ ముక్కను తింటే చాలా మంచిది. ఆపిల్‌లో ఉండే సహజ ఎంజైములు ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్స్‌ను విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తాయి. ఉల్లిపాయ తిన్న కాసేపటికి ఆపిల్ లాంటి పండ్లను తింటే నోటి దుర్వాసనను సులభంగా తగ్గించుకోవచ్చు.

నిమ్మకాయ,సిట్రస్ పండ్లు: కేర్ ఫ్రీ డెంటల్ ప్రకారం.. చేతుల దుర్వాసనను పోగొట్టడానికి నిమ్మరసం ఒక అద్భుతమైన మార్గం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చంపడమే కాకుండా ఉల్లిపాయ వాసనను కూడా పూర్తిగా తొలగిస్తుంది. నిమ్మరసం కలిపిన నీటితో నోటిని పుక్కిలించడం లేదా చేతులకు నిమ్మరసం రాసుకుని కడుక్కోవడం వల్ల వాసన వెంటనే తగ్గిపోతుంది.

గ్రీన్ టీ తాగడం: విన్‌మెక్ హెల్త్ నివేదిక ప్రకారం.. గ్రీన్ టీలో పాలిఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కాంపౌండ్స్ ఉల్లిపాయల వల్ల వచ్చే దుర్వాసన కారకాలను నాశనం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత ఒక కప్పు వేడి గ్రీన్ టీ తాగితే నోరు తాజాగా ఉంటుంది. అలాగే బ్యాక్టీరియా ప్రభావం తగ్గుతుంది.

స్టెయిన్‌లెస్ స్టీల్,ఉప్పు: ఉల్లిపాయలు కోసిన తర్వాత చేతులను స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలకు లేదా స్పూన్లకు రుద్దడం వల్ల ఆ వాసన మాయమవుతుందని మీకు తెలుసా? దీనికి కారణం స్టీల్ మాలిక్యూల్స్ ఉల్లిపాయలోని సల్ఫర్‌తో బంధాన్ని ఏర్పరుచుకుని, దాన్ని చర్మం నుండి తొలగిస్తాయి. అలాగే చేతులపై కొద్దిగా ఉప్పు వేసి రుద్ది కడుక్కోవడం వల్ల కూడా వాసన చాలా వరకు తగ్గుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ