మరో వివాదంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’.. సినిమా డైరక్టర్, విలన్‌పై పిటిషన్.. అసలు విషయం ఇదే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా మరోసారి వివాదంలో పడింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ లాయర్ ఈ సినిమాలో కోర్టులో పిటిషన్ వేశారు. గత కొన్ని రోజుల క్రితం ఈ మూవీలోని రావణిడి పాత్ర
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా మరోసారి వివాదంలో పడింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ లాయర్ ఈ సినిమాలో కోర్టులో పిటిషన్ వేశారు. గత కొన్ని రోజుల క్రితం ఈ మూవీలోని రావణిడి పాత్ర గురించి బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అనంతరం సైఫ్ తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటున్నట్టు తెలిపి క్షమపణలు కూడా చెప్పాడు కూడా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో రావణుడి పాత్ర చాలా బాగా చిత్రీకరిస్తున్నాం. అతను సీతను ఎందుకు అపహరించాడు. అయితే రావణుడు రాముడితో యుద్ధం చేయడం కరెక్టే అని.. ఈ సినిమాలో రావణాసురిడిలోని మంచిని కూడా చూపింంచబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సైఫ్ చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీలో, రాజకీయంగాను వివాస్పదంగా మారాయి. సైఫ్ రావణుడిని పొగుడూతూ చేసిన వ్యాఖ్యలపై హిందు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలపై సైఫ్‌ను అనేకమంది ట్రోల్స్ చేశారు కూడా. సైఫ్ తను మాట్లాడిన మాటలపై క్షమాపణలు చెప్పిన ఈ వివాదం మాత్రం ముగియడం లేదు.
తాజాగా సైఫ్ అలీఖాన్ రావణుడి గురించి చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని యూపీకి చెందిన న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ బుధవారం సైఫ్ అలీఖాన్ పై జౌన్పూర్ కోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్‌తోపాటు ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ పేరును కూడా పిటషన్‌లో పేర్కోన్నారు. కాగా ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.