AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ మొదలైన అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్.. హైదరాబాద్‏లో పలు సన్నివేశాల చిత్రీకరణ..

టాలీవుడ్ టాప్ హీరో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మెయిన్ రోల్‏లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ బుధవారం హైదరాబాద్‏లో ప్రారంభమైంది.

మళ్ళీ మొదలైన అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్.. హైదరాబాద్‏లో పలు సన్నివేశాల చిత్రీకరణ..
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2020 | 2:56 PM

Share

టాలీవుడ్ టాప్ హీరో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మెయిన్ రోల్‏లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ బుధవారం హైదరాబాద్‏లో ప్రారంభమైంది. నగరంలోని బర్కత్ పురాలోని ఓ కళ్యాణ మండపంలో ఈ సినిమా సంబంధించిన ఫైట్ సీన్స్‏ను చిత్రీకరించారు దర్శకుడు సుకుమార్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యుర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మారేడుపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మూవీలో రామ్ లక్ష్మణ్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్, ఓ సాంగ్ షూటింగ్ పూర్తైంది. తర్వాత కొవిడ్ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‏కు బ్రేక్ పడింది. తాజాగా మళ్ళీ ఈ షూటింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ చివరి వరకు ఇక్కడ సినిమా చిత్రీకరణ పూర్తిచేసి ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరిలో మారేడుపల్లిలో షూటింగ్ జరగనున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‏గా నటిస్తున్నారు. గతేడాది విడుదలై అల వైకుంఠపురం సినిమా బాక్సాఫీసులలో కాసుల వర్షం కురింపించిన సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా పై అభిమానులకు భారీగానే అంచనాలు ఉన్నాయి.

జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించిన మద్యం వ్యాపారి కూతురు
మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించిన మద్యం వ్యాపారి కూతురు