హిస్టారికల్ మూవీ.. దొంగగా పవన్..?
సినిమాల్లోకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ దాదాపుగా ఖరారు అయిపోయింది. ఆయన ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ముఖానికి మళ్లీ మేకప్ వేసుకునేందుకు పవన్ సిద్ధంగా ఉన్నాడని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్ రీమేక్‌లో ఆయన త్వరలో నటించబోతున్నారు. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి పవన్, 20రోజులు డేట్లు […]
సినిమాల్లోకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ దాదాపుగా ఖరారు అయిపోయింది. ఆయన ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ముఖానికి మళ్లీ మేకప్ వేసుకునేందుకు పవన్ సిద్ధంగా ఉన్నాడని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్‌లో విజయం సాధించిన పింక్ రీమేక్‌లో ఆయన త్వరలో నటించబోతున్నారు. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి పవన్, 20రోజులు డేట్లు ఇచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత పవన్, క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇప్పుడు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఓ హిస్టారికల్ కథను సిద్ధం చేసుకున్న క్రిష్.. ఇటీవల దానిని పవన్‌కు వినిపించారట. అది విన్న వెంటనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు క్రిష్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో పవన్ దొంగగా కనిపించబోతున్నట్లు టాక్. అయితే పవన్, క్రిష్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇక పవన్ రీ ఎంట్రీ సినిమాకు కూడా ఆయనే దర్శకత్వం వహించబోతున్నట్లు ఆ మధ్యన గాసిప్‌లు గుప్పుమన్నాయి. ఇక తాజాగా మరోసారి ఈ కాంబోకు సంబంధించిన వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.
అయితే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన కథానాయకుడు, మహానాయకుడు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో క్రిష్ గ్రాఫ్ పడిపోయింది. ఇక ఆ మూవీ తరువాత టాప్ హీరోలతో సినిమా తీయాలనుకున్నా వారంతా బిజీగా ఉండటంతో.. పవన్ కోసం క్రిష్ కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఇక దీనికి పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో ఆయన స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. అలాగే పవన్ కల్యాణ్ నటించబోయే మొదటి చారిత్రాత్మక చిత్రం ఇదే కానుంది.