Pawan Daughter Aadhya: పట్టుపరికిని, పాపిడి బిళ్ల కుందనపు బొమ్మలా పవన్ తనయ ఆధ్య సంక్రాంతి సంబరాలు

వన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లు విడాకులు తీసుకున్న తర్వాత రేణు ఆద్య, అకిరా లతో పుణేలో ఉంటుంది. ఐతే పవన్ కళ్యాణ్ తండ్రిగా ఎప్పుడు తన భాద్యతలను నెరవేరుస్తూనే...

Pawan Daughter Aadhya: పట్టుపరికిని, పాపిడి బిళ్ల కుందనపు బొమ్మలా పవన్ తనయ ఆధ్య సంక్రాంతి సంబరాలు
Follow us
Surya Kala

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 14, 2021 | 11:07 AM

Pawan Daughter Aadhya: పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లు విడాకులు తీసుకున్న తర్వాత రేణు ఆద్య, అకిరా లతో పుణేలో ఉంటుంది. ఐతే పవన్ కళ్యాణ్ తండ్రిగా ఎప్పుడు తన భాద్యతలను నెరవేరుస్తూనే ఉన్నాడు. సమయం దొరికినప్పుడు.. ఏవైనా స్పెషల్ అకేషన్స్ లో తన పిల్లలతో గడుపుతాడు. ఇక మెగా ఫ్యామిలీ తో కూడా ఆద్య, అకిరాల బంధం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. ఈ విషయం పలు సందర్భాల్లో బహిర్గతమయ్యింది. తాజాగా నిహారిక పెళ్ళిలో పవన్ కళ్యాణ్ తన పిల్లలతో కలిసి హాజరయ్యాడు. వివాహంలో ఆధ్య, అకిరా తండ్రి పవన్‌తో కలిసి సందడి చేశారు. పెళ్లిలో మెగా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. తాజాగా ఆద్య కొణిదెల ఫొటో ఒకటి బయటకు వచ్చింది. తన తల్లి రేణు దేశాయ్ ఇన్‌స్టగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆధ్య సంక్రాంతి పండగ సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో అచ్చ తెలుగు ఆడపిల్లలలా ముస్తాబయింది. పట్టు పరికిణి, పాపిడి బిళ్లతో, మెడలో హారంతో కుందనపు బొమ్మలా రెడీ అయింది. అయితే ఈ ఫొటోలో ఆధ్య డ్రెస్ తో పాటు మాస్క్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఆ మాస్క్ డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా స్పెషల్ గా రెడీ చేయించింది. ఎంబ్రాయిడరీతో మరింత అందం వచ్చింది. అయితే మాస్క్ ఆధ్య ముఖం కంటే ఎక్కువగా సైజ్ లో ఉంది. దీంతో ముఖం అంతా కవర్ అయ్యి.. కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు అచ్చు పవన్ కళ్యాణ్ కళ్లలా చాలా షార్ప్ గా ఉన్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ.. ఫోటోని తెగ షేర్ చేస్తూ సంబరపడుతున్నారు.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

Also Read: కోడిపందాలపై నిషేధమున్నా.. బరిలోకి దిగిన పందెం కోడి.. కాయ్ రాజా కాయ్..