Ram Tweet: ‘బిగ్ టికెట్’ వివాదంపై హుందాగా స్పందించిన హీరో రామ్…. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయంటూ..
Ram Reaction On Big Ticket: ఎనర్జిటిక్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రెడ్'. సంక్రాంతికి కానుకగా విడుదలవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈస్మార్ట్ శంకర్‌లాంటి సూపర్ హిట్ తర్వాత రామ్ హీరోగా వస్తోన్న చిత్రం కావడంతో...
Ram Reaction On Big Ticket: ఎనర్జిటిక్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రెడ్’. సంక్రాంతికి కానుకగా విడుదలవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈస్మార్ట్ శంకర్‌లాంటి సూపర్ హిట్ తర్వాత రామ్ హీరోగా వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ నడుస్తోంది.
తాజాగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఒక తప్పు జరిగింది. సాధారణంగా ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తికి బిగ్ టికెట్‌ను ఇవ్వడం సంప్రదాయం. ఈ క్రమంలో ‘రెడ్’ వేడుకకు హాజరైన త్రివిక్రమ్‌కు కూడా ఈ టికెట్‌ను ఇచ్చారు. అయితే ఈ టికెట్‌కు ఉన్న కవర్‌ను త్రివిక్రమ్ తీయగానే అందులో క్రాక్ సినిమా టికెట్ ఉంది. ఆ తప్పును గమనించిన ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ క్రాక్ పేరుపై రెడ్ స్టిక్కర్ అంటించి ఇచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా వచ్చాయి.
ఇక తాజాగా ఈ వివాదంపై హీరోగా రామ్ చాలా హుందాగా వ్యవహరించారు. ఈ విషయమై రామ్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ ఈవెంట్‌ను మరుపురాని జ్ఞాపకంగా మార్చినందుకు కృతజ్ఞతలు. అభిమానులకు నేనెప్పుడు రుణపడిఉంటాను. మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఎప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుంది. మీడియా వారికి కూడా నా కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశాడు. ఇక శ్రేయాష్ మీడియాస్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘అప్పుడుప్పుడు తప్పులు జరుగుతుంటాయి.. ఏం పర్వాలేదు. అవేం పట్టించుకోకండి. మీరే బెస్ట్ చీర్స్’ అంటూ పేర్కొన్నాడు.
Trivikram garu – Thank you for making the event so memorable.?
My dearest fans – Loved seeing you all as always ❤️
Media – Thank you for your kind words & support ?@shreyasmedia – Appudappudu Thappulu Jaruguthayi..Em Parledhu..You’re still the best..cheers!?
Love..#RAPO
— RAm POthineni (@ramsayz) January 13, 2021