పాత్ర ఒక్కటే కానీ నటులు ఇద్దరు.. రిషి స్థానంలోకి చేరిన రావల్.. త్వరలో షూటింగ్ స్టార్ట్ ?

పాత్ర ఒక్కటే కానీ నటులు ఇద్దరు.. రిషి స్థానంలోకి చేరిన రావల్.. త్వరలో షూటింగ్ స్టార్ట్ ?

బాలీవుడ్ స్టార్ నటుడు, ఒకప్పటీ హీరో రిషి కపూర్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. అయితే మరణించినడానికి ముందు రిషి

Rajitha Chanti

|

Jan 17, 2021 | 7:38 AM

Actor Rishi kapoor and paresh ravul: బాలీవుడ్ స్టార్ నటుడు, ఒకప్పటీ హీరో రిషి కపూర్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. అయితే మరణించినడానికి ముందు రిషి కపూర్ ‘షర్మాజీ నామ్ కీన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. హితేష్ బాటియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అరవై ఏళ్ళ శర్మాజీ అనే వ్యక్తి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. అదే సమయంలో రిషి కపూర్ మరణించాడు. దీంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా ఈ మూవీ షూటింగ్‏ను తిరిగి ప్రారంభించాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో రిషి కపూర్ పాత్రలో మరో నటుడు పరేష్ రావల్ నటించనున్నారట. ఇందుకు పరేష్ రావల్ కూడా అంగీకరించారని సమాచారం. సాధ్యమైనంత తొందరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి.. రిషి కపూర్ పుట్టిన రోజున అంటే సెప్టెంబర్ 4న దీనిని విడుదల చేయాలని అనుకుంటున్నారట చిత్రయూనిట్.

Also Read:

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu