Krack Movie: హిందీలో రీమేక్ కాబోతున్న మాస్ మహారాజా ‘క్రాక్’ సినిమా.. ఇంతకీ హీరో ఎవరో తెలుసా ?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా క్రాక్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం

Krack Movie: హిందీలో రీమేక్ కాబోతున్న మాస్ మహారాజా 'క్రాక్' సినిమా.. ఇంతకీ హీరో ఎవరో తెలుసా ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 17, 2021 | 7:11 AM

Krack Movie: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా క్రాక్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసుల వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా.. ఈ మూవీ హిట్‏తో రవితేజ మళ్ళీ తన ఫాంలోకి వచ్చాడు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారట. అయితే క్రాక్ మూవీ రీమేక్ కోసం చాలా మంది హీరోలు పోటీలో ఉండగా.. ఇందులో మాత్రం రియల్ హీరో సోనూసూద్‏ను తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఇక లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు సహయం చేసి రియల్ హీరో అయిపోయాడు సోనూ. దేశవ్యాప్తంగా సోనూసూద్‏కి గుడి కట్టి మరి పూజలు చేస్తున్నారు. దీంతో సినిమాల్లో ఇప్పటి వరకు విలన్ పాత్రల్లో నటించిన సోనూసూద్‏ పాత్రలో మార్పులు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే ప్రస్తుతం క్రాక్ రీమేక్‏లో సోనూ హీరోగా నటించబోతున్నట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే సోనూ హీరోగా నటించబోతున్నారా ? లేదా ? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: క్రాక్ : అదిరిపోయే మాస్ నంబర్‌తో మాస్ రాజా, అభిమానులకు పూనకాలేనట

తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం, ఒకే మూవీలో పవర్ స్టార్, సూపర్ స్టార్, ఫ్యాన్స్‌కు పూనకాలే !