AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Australia 2020: పుజారా, రహానేలు అవుట్.. 53 ఓవర్లకు టీమిండియా 144/4.. ఇంకా 225 పరుగుల వెనుకంజ..

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. నిన్న వర్షం కారణంగా...

India Vs Australia 2020: పుజారా, రహానేలు అవుట్.. 53 ఓవర్లకు టీమిండియా 144/4.. ఇంకా 225 పరుగుల వెనుకంజ..
India Vs Australia
Ravi Kiran
|

Updated on: Jan 17, 2021 | 7:27 AM

Share

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. నిన్న వర్షం కారణంగా ఆటను ముందుగానే అంపైర్లు నిలిపివేయడంతో.. నేడు అరగంట ముందే మ్యాచ్‌ను మొదలుపెట్టారు. 62/2 పరుగుల దగ్గర మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. 105 పరుగుల టీమ్ స్కోర్ వద్ద పుజారా(25) వికెట్ కోల్పోయింది.

అయితే తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహనే(37) మరో వికెట్ పడకుండా మయాంక్ అగర్వాల్(25*)తో కలిసి కొద్దిసేపు ఇన్నింగ్స్ చక్కపెట్టినా.. ఆ తర్వాత అనూహ్యంగా స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 53 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 225 పరుగులు వెనుకబడి ఉంది. ఇరు జట్లకు మూడో రోజు ఆట కీలకంగా మారనుంది.