AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA: ఆహా ‘మందాకిని’కి సూపర్‌ రెస్పాన్స్‌.. సోషియో ఫాంటసీ థ్రిల్లింగ్‌ సిరీస్‌పై ప్రముఖుల ప్రశంసలు

ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోన్న ఆహా తాజాగా మందాకినీ డైలీ సీరియల్‌తో మన ముందుకొచ్చింది. ఫస్ట్‌ డైలీ సిరీస్‌గా వచ్చిన మిస్టర్‌ పెళ్లాం తర్వాత ఆహాలో వచ్చిన సెకెండ్‌ సీరియల్‌ ఇది.

AHA: ఆహా 'మందాకిని'కి సూపర్‌ రెస్పాన్స్‌.. సోషియో ఫాంటసీ థ్రిల్లింగ్‌ సిరీస్‌పై ప్రముఖుల ప్రశంసలు
Aha Mandakini
Basha Shek
|

Updated on: Mar 08, 2023 | 7:10 PM

Share

ఆసక్తికరమైన సీరియల్స్‌, వెబ్‌ సిరీస్‌లను అందిస్తూ పక్కా లోకల్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఆహా. అలాగే ఇండియన్‌ ఐడల్‌, అన్‌స్టాపబుల్‌ వంటి రియాలిటీ షోలతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోన్న ఆహా తాజాగా మందాకినీ డైలీ సీరియల్‌తో మన ముందుకొచ్చింది. ఫస్ట్‌ డైలీ సిరీస్‌గా వచ్చిన మిస్టర్‌ పెళ్లాం తర్వాత ఆహాలో వచ్చిన సెకెండ్‌ సీరియల్‌ ఇది. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సీరియల్ మొదటి నాలుగు ఎపిసోడ్స్‌ మార్చి 6న స్ట్రీమింగ్‌ అయ్యాయి. కార్తీక దీపం ఫేమ్‌ నిరుపమ్ పరిటాల, వాసుదేవరావు వంటి బుల్లితెర ప్రముఖులు ఈ సిరీస్‌ను మెచ్చుకుంటూ యూనిట్‌ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీరియల్‌లో ఆర్. కె. చందన్, హిమబిందు, మిధున్, జయలలిత, సాయికిరణ్, వర్ష, ప్రియా హెగ్డే, నాగిరెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్.కె. మలినేని దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ మండల కథను అందించగా, ఆసం శ్రీనివాస్ మాటలు రాశారు. వరుణ్ చౌదరి గోగినేని ఈ డైలీ సీరిస్ ను నిర్మించారు. గా సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడే వాళ్ల కోసం ప్రత్యేకంగా ఈ డైలీ సీరియల్‌ను సిద్ధం చేశారు మేకర్స్‌. అంతేకాదు తొలి ఎనిమిది ఎపిసోడ్స్ ను ఉచితంగా చూసే అవకాశాన్ని ఆహా సంస్థ కల్పిస్తోంది. వాటిని చూసిన తర్వాత తప్పనిసరిగా ఆహా సబ్ స్క్రిప్షన్ చేసి మిగిలిన భాగాలను వీక్షిస్తారన్నది సంస్థ భావిస్తోంది.

కథ విషయానికొస్తే..

ఆర్య (ఆర్.కె. చందన్) ఓ యాడ్ ఫిల్మ్ మేకర్. అతనికి తరచూ కలలో మందాకిని (హిమబిందు) కనిపిస్తుంటుంది. అయితే మొత్తానికి నిజ జీవితంలో ఓ రోజున ఆమెను కలుస్తాడు. అయితే అప్పటికే మందాకిని ఓ శాపానికి గురై ఉంటుంది. తెలంగాణలోని మారుమూల గ్రామంలోని పురాతన దేవాలయంలో మందాకినితో కలిసి ఆర్య పూజలు నిర్వహిస్తే ఆ శాపం తొలగిపోతుందని తెలుస్తుంది. కానీ కళింగ వర్మ (మిథున్) అనే ఓ వ్యక్తి వీరిని ఆ పూజలు చేయకుండా అడ్డుపడుతుంటాడు. మరి మందాకిని శాపవిమోచనం ఎలా జరిగింది? అందుకు ఆర్య ఎలా సహాయపడ్డాడు? అనేది ఈ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌ కథ.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..