Gangs of Godavari OTT: ఓటీటీలోకి విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎట్టకేలకు మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింద. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మాస్ కా దాస్ విశ్వక్ సేన నటనకు మంచి పేరొచ్చింది. అయితే పోటీలో గం గం గణేశా, భజే వాయు వేగం లాంటి డిఫరెంట్ సినిమాలు కూడా ఉండడం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు మైనస్ గా మారిందిg

Gangs of Godavari OTT: ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Gangs Of Godavari Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 07, 2024 | 9:40 AM

‘గామి’తో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో మన ముందుకు వచ్చాడు. కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌ గా నటించింది. తెలుగమ్మాయి అంజలి మరో కీలక పాత్రలో మెరిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎట్టకేలకు మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింద. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మాస్ కా దాస్ విశ్వక్ సేన నటనకు మంచి పేరొచ్చింది. అయితే పోటీలో గం గం గణేశా, భజే వాయు వేగం లాంటి డిఫరెంట్ సినిమాలు కూడా ఉండడం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు మైనస్ గా మారింది. అందుకే రెండో వారంలోనే ఈ మూవీ కలెక్షన్లు పడిపోయాయి. దీనికి తోడు ఈ వారం శర్వానంద్ మనమే లాంటి సినిమాలు కూడా థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. దీంతో కలెక్షన్లు మరింత డ్రాప్ అయ్యే అవకాశముంది. మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని చాలామంది సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ నెలలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలోకి రానుందని టాక్ నడుస్తోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ ఆఖరి వారంలో ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హైపర్ ఆది, నాజర్, మధు నందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, పృథ్వీ రాజ్, అయేషా ఖాన్ (స్పెషల్ సాంగ్) తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు అందించారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కథ విషయానికి వస్తే.. 19 90ల్లో గోదావరి జిల్లాలోని ఓ లంక ప్రాంతంలో జరిగే కథగా తెరకెక్కించారు. ఒక యువకుడు రాజకీయాలను వాడుకుని ఎలా పైకి ఎదిగాడు అనేది సినిమా కథ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.