Aha OTT: ఆహాలో రాబోతున్న విశ్వక్ సేన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. ‘దాస్ కా ధమ్కీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

నివేదా పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. దర్శకుడిగా మరోసారి భారీ విజయాన్ని అందుకున్నారు విశ్వక్. ఇప్పటివరకు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది.

Aha OTT: ఆహాలో రాబోతున్న విశ్వక్ సేన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. 'దాస్ కా ధమ్కీ' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Das Ka Dhamki
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 06, 2023 | 7:05 PM

ఈ ఏడాది సూపర్ హిట్స్‎గా నిలిచిన చిత్రాల్లో దాస్ కా ధమ్కీ ఒకటి. మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించి.. స్వియ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. దర్శకుడిగా మరోసారి భారీ విజయాన్ని అందుకున్నారు విశ్వక్. ఇప్పటివరకు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ఈ సినిమా ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈవిషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్‌పై విశ్వ‌క్ సేన్‌, కరాటే రాజు నిర్మించారు. మార్చి 22న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై మెప్పించిన ఈ సినిమాలో రంగ‌స్థ‌లం మ‌హేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. డ‌బ్బు కోసం ఎంత‌టి దారుణానికైనా ఒడిగ‌ట్టే వ్య‌క్తి సంజ‌య్ రుద్ర‌. పుట్టిన త‌ర్వాత అనాథ‌గా మారి చాలా క‌ష్ట‌ప‌డి పెరిగి పెద్దైన మ‌రో వ్య‌క్తి కృష్ణ‌దాస్‌.. మ‌ధ్య జ‌రిగే పోరాట‌మే దాస్ కా ధమ్కీ.

ఇవి కూడా చదవండి

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ ఇద్ద‌రూ ఒకేలా ఉండ‌టం. విశ్వ‌క్ సేన్‌, హైప‌ర్ ఆది, మ‌హేష్‌ల న‌ట‌న‌తో ఇంట‌ర్వెల్ వ‌ర‌కు స‌ర‌దాగా సాగిపోయే ఈ సినిమా ఇంట‌ర్వెల్ త‌ర్వాత ఎవ‌రూ ఊహించ‌ని ట‌ర్న్ తీసుకుంటుంది. అస‌లు వీరి మ‌ధ్య గొడ‌వేంటి? ధ‌న‌వంతుడు సంఘంలో పేరున్న సంజ‌య్ రుద్ర ఉన్న‌ట్లుండి కృష్ణ‌దాస్‌ను ట్రాప్ చేయాల‌న‌కున్న విష‌యాలు, క‌థ‌లో ఉండే ట్విస్టులు, ట‌ర్నులు ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతాయి. అలాంటి మూమెంట్స్‌తో ఆడియెన్స్‌కి అందించ‌టానికి సిద్ధ‌మైంది ఆహా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.