OTT Movies: ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. ఆన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రెడీ..

ఇక ఇప్పుడు మరిన్ని సినిమాలను రిలీజ్ చేసే పనిలో పడ్డాయి పలు ఓటీటీ సంస్థలు.. నెట్ ప్లిక్స్, జీ5, ఆహా.. అమెజాన్ ప్రైమ్.. ఇలా అన్నింటిలోనూ బ్లాక్ బస్టర్ చిత్రాలు రాబోతున్నాయి. అవెంటనో తెలుసుకుందామా.

OTT Movies: ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే.. ఆన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రెడీ..
Ott Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2023 | 11:01 AM

ఓవైపు థియేటర్లలో స్టార్ హీరోస్ సినిమాలు రచ్చ చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి, వారుసుడు, తునీవు చిత్రాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు, సూపర్ హిట్ చిత్రాలు.. టాక్ షోస్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. వారం వారం మరింత ఎంటర్టైన్మెంట్.. మరింత జోష్‏తో కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నారు. ఇక ఇప్పుడు మరిన్ని సినిమాలను రిలీజ్ చేసే పనిలో పడ్డాయి పలు ఓటీటీ సంస్థలు.. నెట్ ప్లిక్స్, జీ5, ఆహా.. అమెజాన్ ప్రైమ్.. ఇలా అన్నింటిలోనూ బ్లాక్ బస్టర్ చిత్రాలు రాబోతున్నాయి. అవెంటనో తెలుసుకుందామా.

నెట్ ఫ్లిక్స్.. రష్మిక మందన్నా.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మిషన్ మజ్ను. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. జనవరి 20న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కానుంది. అలాగే మాస్ మాహారాజా రవితేజ నటించిన ధమాకా జనవరి 22న స్ట్రీమింగ్ కానుండగా.. మలయాళ చిత్రం కాపా..జనవరి 19న అందుబాటులోకి రానుంది. ఫౌడా సీజన్ 4.. జనవరి 20 షహ్మరాన్.. జనవరి 20

డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఝాన్సీ సీజన్ (తెలుగు వెబ్ సిరీస్)… జనవరి 19న స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

జీ5.. ఛత్రివాలి (హిందీ సినిమా).. జనవరి 20న స్ట్రీమింగ్ కానుంది. బిగ్ బాస్ ఫేమ్ సన్ని నటించిన ఏటీఎం (తెలుగు.. తమిళ్ వెబ్ సిరీస్).. జనవరి 20న స్ట్రీమింగ్.

ఆహా… డ్రైవర్ జమున.. జనవరి 20న స్ట్రీమింగ్.