Regina In AHA: మరో వినూత్న పాత్రతో రానున్న రెజీనా.. ఆహా, ఆర్కా సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న..
Regina In AHA: ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. బడా నిర్మాణ సంస్థలు సైతం వెబ్ సిరీస్‌లను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో మంచి కంటెంట్‌తో...
Regina In AHA: ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. బడా నిర్మాణ సంస్థలు సైతం వెబ్ సిరీస్‌లను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో మంచి కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోయిన్‌లు తమన్నా, నయనతార, వంటి తారలు వెబ్ సిరీస్‌లతో దూసుకెళుతుండగా తాజాగా అందాల తార రెజీనా కూడా వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పారు. తొలి తెలుగు ఓటీటీ ఆహా, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా సంయుక్తంగా నిర్మిస్తోన్న వెబ్ సిరీస్‌లో రెజీనా నటిస్తున్నారు.
‘అన్యాస్ ట్యుటోరియల్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌కు గంగిరెడ్డి పల్లవి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్త్య, నివేదా సతీష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటి రెజీనా వెబ్ సిరీస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హారర్ కథకు నిజమైన ఎమోషన్స్ జోడిస్తూ రాసుకొచ్చిన ఈ కథ తనను ఎంతో ఆకట్టుకుందని రెజీనా తెలిపారు. ఇందులో నివేదితా తనకు సోదరిగా నటిస్తుందని, ప్రతిభావంతులైన మహిళా బృందంతో ఈ సిరీస్ చేస్తున్నామని ఆమె తెలిపారు. క్రిస్మస్ కారణంగా ఈ వెబ్ సిరీస్‌ను ‘ఆహా’లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఎవరు’, ‘చక్ర’ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశాలతో వచ్చిన సినిమాల్లో నటించి తనలోని మరో కోణాన్ని బయటపెట్టిన రెజీనా మరి ఈ వెబ్ సిరీస్‌తో ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
Also Read: Road Accidents: తెలంగాణలో రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం..
వామ్మో.. ఈ అమ్మడికి ఎంత బలముందో..! ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు.
Agent Movie: అఖిల్ జోడీగా తమిళ్ బ్యూటీ.. “ఏజెంట్” సినిమా కోసం డైరెక్టర్ భారీ ప్లాన్..