Karthika Deepam: మోనిత మరో డెవిల్ ప్లాన్.. ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకం.. రోషిణి ఎంట్రీ

Karthika Deepam: కార్తీక దీపం ఈరోజు 1094 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ ను చూద్దాం.. ఆనందరావు వచ్చిన సంతోషంలో అందరూ కలిసి భోజనానికి..

Karthika Deepam: మోనిత మరో డెవిల్ ప్లాన్.. ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకం.. రోషిణి ఎంట్రీ
Karthika Deepam
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 17, 2021 | 10:17 AM

Karthika Deepam: కార్తీక దీపం ఈరోజు 1094 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ ను చూద్దాం.. ఆనందరావు వచ్చిన సంతోషంలో అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. కార్తీక్ .. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ..కంచంలో గీతలు గీస్తుంటాడు.. దీంతో ఆనందరావు అదేంటి అని అడిగితె.. శౌర్య ఇంట్లో గోడమీద కూడా గీతలున్నాయని అంటుంది. ఎందుకు అంటే.. ఇంతలో దీప తాతయ్యని భోజనం చేయనివ్వు అంటుంటుంది. ఎదో జరుగుతుంది. నాకు తెలియకుండా వీళ్లంతా జాగ్రత్తపడుతున్నారు. అదేమిటో తెలుసుకోవాలి అనుకుంటాడు ఆనందరావు. ఇంతలో మోనిత.. కార్తీక్ కు ఫోన్ చేసి.. మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది వీడియో చూడు అంటుంది. వీడియో చూసిన కార్తీక్ దీపని పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు నేను సాయంత్రం వస్తా అంటూ.. బయటకు బయలుదేరతాడు.. దీంతో దీప కార్తీక్ కారు దగ్గరకు వచ్చి ఏమిటి అని అడుగుతుంది..

మోనిత చేయి కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది.. డాక్టర్ భారతి ట్రీట్మెంట్ చేస్తుంటే.. ప్రియమణి ఏడుస్తూ.. మా అమ్మగారికి దిష్టి సోకింది.. దూదిలా ఉండే అమ్మగారు.. సూదిలా సన్నబడిపోయారు అంటూ ఏడుస్తుంది. సమయానికి ప్రియమణి చూడకపోతే ప్రాణం పోయేది కార్తీక్ అంటుంది భారతి. మా అమ్మగారిని ఒక్కరూ అర్ధం చేసుకోరు.. కడుపులో ఉన్న బిడ్డ కోసం అయినా బతకాలి అని చెబుతున్నా నాకు బతకాలి లేదు అంటూ ఇలా చేసింది అంటుంది .. భారతి ఏమిటి కార్తీక్.. ఇప్పుడు మోనితకు ఏమైనా జరిగిఉంటే ఎంత అల్లరిపాలయ్యేవాడివి.. దీప నువ్వు కలిసిపోయారు అనుకుంటే ఇలా తెచ్చి పెట్టుకున్నావు అంటుంటే.. ప్రియమణి అమ్మా డాక్టరమ్మా ఎటు నిద్రపోతుంది కదా.. ఆ కడుపు పోవడానికి ఏదైనా మందు ఇవు అని అంటుంటే.. ఏఎస్పీ రోషిణి వస్తుంది.

ఆపని చేయండి కార్తీక్.. ఈ ప్రియమణి చెప్పినట్లు చేయండి నీకు కావాల్సింది అదేకదా.. అంటూనే ప్రియమణి ఫోన్ చేయకపోతే మీరు ఎవరు నాకు ఫోన్ చేసేవారు కాదు ఏమో.. ఎలా ఉంది పెళ్లికాని తల్లికి డాక్టర్ అని అడిగితే ప్రాణాపాయం లేదు అంటుంది డాక్టర్ భారతి. దీంతో రోషిణి రండి పెళ్లిఅయిన తండ్రిగారు అంటుంది వేరే హల్ లోకి తీసుకొచ్చి.. ఎందుకు చేశారు ఈ పని.. మీకు మంచి పేరు, పెళ్లి అయిన వ్యక్తి.. రాయల్ ఫ్యామిలీకి చెందిన వారు.. హక్కులు హద్దులు తెలుసు.. మంచి చెడు అన్నీ తెలుసు.. ఇక్కడికి తరచుగా వస్తూ పోతూ ఉంటె.. ఇలాంటి ఉపద్రవాలు వస్తాయని తెలుసు.. నేను ఎంక్వైరీ చేశాను.. మోనిత ని ఒకసారి పెళ్లి చేసుకోబోయేరట కదా అని అడుగుతుంది రోషిణి.

నేను మోనిత మీద మనసుపడి పెళ్లి చేసుకోవాలని కోలేదు.. ఒకప్పుడు నా కథ మీకు తెలుసు.. దీప నేను అపార్ధాలతో దూరంగా ఉన్నాం అంటే.. అపార్ధాలతోనా లేక అనుమానాలతోనా అంటుంది రోషిణి. అనుమానంతో.. దీపను నన్ను కలపడానికి మా మమ్మీ ప్రయత్నం చేస్తుంటే.. మోనితని పెళ్లి చేసుకుంటే.. మా మమ్మీ ఇక దీపని నన్ను కలిపే ప్రయత్నం ఆపేస్తారనుకున్నా అంటాడు కార్తీక్.. దీంతో రోషిణి మీరు మోనిత ని ప్రేమించలేదు రైట్..

లేదు నేను ఎప్పుడు ప్రెండ్ లాగానే చూశాను.. మీరు మోనితను ప్రెండ్ లా చూస్తే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఎందుకు చుడాల్సి వచ్చింది. అప్పుడప్పుడు మీరు ఇక్కడి వచ్చి తాగేవారట కదా.. ఈ తప్పు మీకు తెలియకుండానే జరిగింది అంటే అవును అంటాడు కార్తీక్. తాగిన మైకంలోనే .. అంటుంది..అని మోనిత చెబుతుంది. ఈ అనైతిక విషయం జరిగిందని మోనిత చెప్పేవరకూ తెలియదు .. మీ ప్రయత్నం ఉన్నా లేకపోయినా ఫలితం నువ్వు అనుభవించక తప్పదు కార్తీక్ అంటుంది రోషిణి. దీంతో ఇది మోనిత ఇది కదా నాకు కావాల్సింది.. చేయి కోసుకుని కార్తీక్ ని ట్రీట్మెంట్ కోసం భారతి ప్రియమణితో రోషిణి రప్పించింది సాక్ష్యం కోసమేగా.. ఇప్పుడు దీప ఎం చేస్తుంది.. నా నాటకం భలే రక్తి కట్టింది అనుకుంటూ నవ్వుకుంటుంది.

కార్తీక్ ని బయటకు తీసుకుని వచ్చి.. మీరు దీప తప్పు చేయకపోయినా అనుమానించారు. అదే దీప మీరు తప్పు చేసినా అనుమానించడం లేదు.. ప్రేమ అంటే అది ఇది కాదు.. చేయి కోసుకోవడం అందరినీ రప్పించడం బెదిరింపు అయి ఉండొచ్చు.. మోనిత మీద నాకు జాలి లేదు.. అయితే ఇప్పడు ఎవరికీ న్యాయం చేస్తారు.. చట్టానికి సమాజానికి ఏమి సమాధానం చెబుతారు ఆలోచించండి అంటూ వెళ్ళిపోతుంది రోషిణి.

భాగ్యం.. మురళీ కృష్ణ మోనిత పెళ్లి ఆపలేకపోతున్నాం అంటుంటే.. నేను ఛస్తే ఈ పెళ్ళి ఆగుతుందా అని మురళీ కృష్ణ అడుగుతాడు.. దీంతో నువ్వు చస్తే.. నా మెడలో తాళి తెగుతుంది.. అంతేకానీ మోనిత మెడలో తాళి పడడం ఆగదు.. ఇలాంటి పిచ్చి మాటలు కాకుండా మంచిగా ఆలోచించు అంటుంది భాగ్యం.

మరోవైపు ఆనందరావు ఆదిత్యని పిలిచి ఫామ్ హౌస్ లోని కూరగాయలు పండ్లు కారులో పెట్టించు.. రేపు నా ఫ్రెండ్ కొడుకుని చూడడానికి వెళ్తా అంటాడు.. తర్వాత ఇంట్లో ఏమి జరుగుతుంది అని అడిగితె.. ముందు చెప్పుదామని అనుకున్న ఆదిత్య.. అందరి మాటలు గుర్తు చేసుకుని ఏమి లేదు అని అక్కడ వెళ్ళిపోతాడు.

దీప కార్తీక్ కోసం ఎదురు చూస్తుంది.. కార్తీక్ కంగారుగా వెళ్తూ.. మోనిత పంపిన వీడియో గుర్తు చేసుకుంది.. మోనిత చేయి కోసుకుంటూ.. నేను చచ్చిపోతున్నా నీ చేతుల్లో పోతా చివరిసారిగా చూడాలని ఉంది ఇప్పటికే నీమీద కేసు నడుస్తుంది.. ఇప్పుడు ఎవరైనా నా చావుకు నువ్వు కారణం అంటే నిన్ను జైలుకు పంపిస్తారు.. అప్పుడు నా ఆత్మకు శాంతి ఉండదు.. నీ చేతుల్లోనే ప్రాణం విడవాలని ఉంది.. రా కార్తీక్ అన్న విషయం గుర్తు చేసుకుంటుంది. అదెక్కడ చస్తుంది.. ఈయని బెదిరించాడు కారణం వెదుకుకుంది. ఇదంతా బెదిరించడానికే.. కానీ కేసు పెడితే.. దానిని లోపల వేస్తారుగా .. అది నా భర్తకే చెడు తెస్తుంది అని అంటూ ఆలోచిస్తుంది..

కారులో వస్తున్న కార్తీక్.. రోషిణి మాటలను గుర్తు చేసుకుంటాడు. మోనిత ప్లాన్ ను గుర్తు చేసుకుంటాడు.. తలవంచి మాట్లాడం మానేసి.. ఎదిరించడం మొదలు పెట్టానో.. ఇలా నాటకం మొదలు పెట్టింది. ఇదంతా నాటకం.. ఒకే సమయంలో నన్ను భారతిని రప్పించి .. బెదిరించాలని చూస్తుంది.. ఇక నుంచి మరింత కేర్ఫుల్ గా ఉండాలని అనుకుంటాడు. మోనిత విషయంలో అమ్మ దీప చెప్పినప్పుడు వినలేదు.

Also Read:

India Corona Cases: దేశంలో కొత్తగా 38,079 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
మీ జుట్టు పట్టుకుచ్చులా మారాలంటే కొబ్బరి పాలను ఇలా వాడండి..
మీ జుట్టు పట్టుకుచ్చులా మారాలంటే కొబ్బరి పాలను ఇలా వాడండి..
అన్‌స్టాప‌బుల్‌లో షోలో డాకు మహారాజ్ టీమ్..
అన్‌స్టాప‌బుల్‌లో షోలో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..