Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ ఫినాలే.. విన్నర్ ఎవరు.. ?

ఫైనల్ కు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో అనిరుధ్, కీర్తన, నజీరుద్ధీన్, శ్రీకీర్తి, స్కంద టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా ఈ షో ఫైనల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా ఓటీటీ. అందులో అదిరిపోయే ఫర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు ఐదుగురు కంటెస్టెంట్స్.

Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ ఫినాలే.. విన్నర్ ఎవరు.. ?
Telugu Indian Idol 3
Follow us

|

Updated on: Sep 15, 2024 | 3:28 PM

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సంగీత ప్రియులను అలరిస్తోన్న సింగింగ్ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’. గత రెండు సీజన్లపాటు విజయవంతంగా సాగిన ఈ షో.. ఇప్పుడు మూడో కొనసాగుతుంది. దాదాపు 24 వారాల నుంచి ప్రతి శనివారం, ఆదివారాల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 1500 మందికి పైగా ఆడిషన్స్‏లో వంద మందిని సెలక్ట్ చేసి వారిలో 12 మందిని ఈ షో కోసం కంటెస్టెంట్స్ గా తీసుకున్నారు. ఇక ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ కు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో అనిరుధ్, కీర్తన, నజీరుద్ధీన్, శ్రీకీర్తి, స్కంద టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా ఈ షో ఫైనల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది ఆహా ఓటీటీ. అందులో అదిరిపోయే ఫర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు ఐదుగురు కంటెస్టెంట్స్.

కీర్తన పరువం వాలాగ.. పాటతో మైమరపించగా.. గోంగూర తోటకాడ కాపుకాశా అంటూ మాస్ పాటతో ఊర్రూతలూగించింది. మాటే రాని చిన్నదాని పాటతోపాటు రచ్చాడుకోగా.. అంటూ అదరగొట్టేశాడు నజీరుద్ధీన్ . దుమ్మురేపే ఆపరేషన్, దమ్ము ఆపే మాస్ యాక్షన్ పాటతోపాటు చంద్రలేఖా అంటూ సంగీత ప్రియులను ఆకట్టుకుంది శ్రీకీర్తి. ఇది రణరంగం పాటతో అలరించాడు అనిరుధ్. ఈ గ్రాండ్ ఫినాలే ఎవరు విన్నర్ అనేది ఈరోజు తెలియనుంది. తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది.

ఈ షోకు జడ్జీలుగా తమన్, గీతా మాధురి వ్యవహరిస్తున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో మెలికల్ తిరుగుతుంటే అమ్మాయే పాటతో అదరగొట్టేసింది. ఇక తమన్ డై హార్డ్ ఫ్యాన్ అంటూ కీర్తన తమ్ముడిని స్టేజ్ మీదకు పిలవగా.. తమన్ ఆటపట్టించాడు. ప్రస్తుతం ఈ షో ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈరోజు తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఫైనల్ విన్నర్ ఎవరనేది తెలియనుంది.

ఇవి కూడా చదవండి

తెలుగు ఇండియన్ ఐడల్ ఫీనాలే ప్రోమో.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్